Dundi Ganesh Seva Samiti Idol : 72 అడుగుల మహా గణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Aug 27 , 2025 | 10:17 PM
విజయవాడ డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
విజయవాడలోని సీతార సెంటర్‍లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతి
విజయవాడ డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
గణపతిస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబు
గణేశుని మండపం ముందు ఫొటో దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు
భక్తితో ప్రార్ధిస్తే ఎక్కడా అవరోధాలు ఉండవు, అపహాస్యం చేస్తే మాత్రం వారి జీవితాల్లో అడుగడుగునా అడ్డంకులేనన్న చంద్రబాబు
వినాయకుడు అంటే తమషా కాదు.. వడ్డీతో సహా వసూలు చేస్తాడు అంటూ గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై సీఎం వ్యాఖ్య
గత వైసీపీ ప్రభుత్వం ఆగడాలతో ఐదేళ్ల పాటు జనాలు సరిగా గణేష్ ఉత్సవాలు కూడా జరుపుకోలేకపోయారన్న చంద్రబాబు
2019 నుంచి 2024 వరకు డూండీ గణేష్ ఉత్సవాలు జరగనివ్వకుండా ప్రవర్తించారని చంద్రబాబు ఆగ్రహం
ఎటువంటి పర్మిషన్లు లేకుండా గణేశ్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నామన్న చంద్రబాబు
Updated Date - Aug 27 , 2025 | 10:22 PM