ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Republic day: అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

ABN, Publish Date - Jan 26 , 2025 | 01:20 PM

ఆంధ్రప్రదేశ్: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

1/10

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

2/10

రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

3/10

ముందుగా ఇందిరాగాంధీ స్టేడియం వద్దకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌ సాయుధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు.

4/10

సాయుధ దళాల కవాతు అనంతరం ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను గవర్నర్ ఎగరవేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

5/10

ఏడు నెలలకు ముందు ఏపీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొందని గవర్నర్ చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను డైవర్ట్ చేయడంతో ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడించారు.

6/10

ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, 93 శాతం స్రైక్ రేట్‌తో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని గౌవర్నర్ పేర్కొన్నారు.

7/10

పోలవరం, రాజధాని అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఏపీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేలా చేస్తున్నారని అబ్దుల్ నజీర్ చెప్పారు.

8/10

స్వర్ణాంధ్ర-2047కు రోడ్ మ్యాప్‪ రూపొందిస్తున్నామని, ఆరోగ్య, ఐశ్వర్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ చెప్పారు.

9/10

ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శించారు.

10/10

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు నారా లోకేశ్, సవిత, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి, సీఎస్ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 26 , 2025 | 01:20 PM