తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 09:44 AM
Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినాన స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడి అభయం
ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం.
అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం.
భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి , పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 04 , 2025 | 09:46 AM