ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలంలో మల్లన్న బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ABN, Publish Date - Feb 17 , 2025 | 07:29 PM

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీభ్రమరాంభ సమేత శ్రీమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితోపాటు ఆలయ పండితులు ఆహ్వానించారు. సోమవారం అమరావతిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును వారు కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు స్వామి వారి ప్రసాదంతోపాటు చిత్రపటాన్ని అందజేసి.. ఆశీర్వదించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మరోవైపు మహాశివుని బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని.. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగనివ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల శ్రీశైలం ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు అమరావతిలో సమీక్షించి.. కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

1/4

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీభ్రమరాంభ సమేత శ్రీమల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి అంటే.. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ చిత్రంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డితోపాటు శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు ఉన్నారు.

2/4

సీఎం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలను అందించడంతోపాటు బొట్టు పెడుతోన్న ఆలయ పండితులు

3/4

సీఎం చంద్రబాబును ఆశీర్వదిస్తున్న ఆలయ పండితులు

4/4

సీఎం చంద్రబాబుకు అమ్మ అయ్యవార్లల చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బి. రాజశేఖరరెడ్డితోపాటు పండితులు

Updated Date - Feb 17 , 2025 | 07:33 PM