ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Retirement Visa: ఉద్యోగవిరమణ చేశారా? ఈ రిటైర్మెంట్ వీసాపై ఓ లుక్కేయండి!

ABN, Publish Date - Jan 17 , 2025 | 09:38 PM

రిటైర్ అయ్యాక ఫారిన్ టూర్లపై వెళ్లొద్దామనుకునే వారు రిటైర్మెంట్ వీసాల గురించి తెలుసుకోవాలి. పదవి విరమణ పొందిన వారి కోసం ఉద్దేశించిన ఈ వీసాలతో విదేశీ లొకేషన్లలో నచ్చినంతకాలం ప్రశాంతంగా గడపొచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: వీసా అనగానే మనకు స్టూడెంట్ వీసా, జాబ్ వీసాలు గుర్తొస్తాయి. మరి రిటైర్మెంట్ వీసా కూడా ఒకటి ఉందని మీకు తెలుసా? థాయ్‌లాండ్, మారిషస్ మొదలు స్పెయిన్ వరకూ అనేక దేశాలు ఈ వీసాను అందిస్తున్నాయి. మరి దీని విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

కెరీర్‌, పెళ్లి, పిల్లల పెంపకం..ఇలా రకరకాల బాధ్యతలతో గడిపేసే అనేక మంది రిటైర్మెంట్ తరువాత రెస్టు తీసుకునేందుకు అనేక ప్లాన్స్ వేసుకుంటారు. కొందరు కుటుంబంతో గడుపుదానుకుంటే మరికొందరు సరదాగా విహారయాత్రలు చేసి రావచ్చని భావిస్తారు. కొందరు మాత్రం విదేశాల్లో వీలైనన్ని రోజులు గడపాలని ఉత్సాహపడతారు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే రిటైర్మెంట్ వీసాలు అందుబాటులోకి వచ్చాయి (NRI).


UAE: యుఏఈలో సంక్రాంతి సంబరాలు

ఏమిటీ రిటైర్మెంట్ వీసా..

పదవీ విరమణ పొందిన వారికోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన వీసానే రిటైర్మెంట్ వీసా. సాధారణంగా వీటిని ఏడాది కాలపరిమితిపై జారీ చేస్తారు. గడువు ముగిశాక మళ్లీ వీసాను పునరుద్ధరించుకోవచ్చు. 50 నుంచి 55 ఏళ్లు పైబడిన వారికే ఈ వీసాను జారీ చేస్తారు. ముఖ్యంగా ఈ వీసాకు దరఖాస్తు చేసుకునే వారు తాము ఆర్థికంగా స్థిరంగా ఉన్నామని రుజువు చేసుకోవాలి. ఇందుకోసం పెన్షన్ లేదా ఇతర ఆదాయ వనరులను చూపించాలి. మనం వెళ్లబోయే దేశంలో ఖర్చులను భరించేస్థాయిలో ఈ ఆదాయం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆదాయంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. నేర చరిత్ర అస్సలు ఉండకూడదు. అలాగే విదేశాల్లో ఎక్కడ ఉండబోయే స్పష్టమైన చిరునామా కూడా ఇవ్వాలి. ఇక ఈ వీసా అందాక ఆయా దేశాలకు వెళ్లి హ్యాపీగా కాలం గడపొచ్చు. ఆదరాబాదరా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి మలి సంధ్యలో నచ్చిన ప్రదేశంలో ప్రశాంతమైన లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.


Sankranti Celebrations: జపాన్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

అయితే, ఈ వీసాకు దరఖాస్తు చేసుకునే ముందు వ్యక్తులు తాము ఎంచుకున్న దేశం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఈ దిశగా వీసా కన్సల్టింగ్ సంస్థల సాయం తీసుకోవచ్చని చెబుతున్నారు. రిటైర్మెంట్ కోసం ఎంచుకున్న దేశంలోని జీవనవ్యయాలు, అక్కడి వాతావరణం ప్రకృతి అందాలు, పన్నులపై రాయితీలు, వైద్య సేవలు, కొత్త సంస్కృతిలో ఇమడగలమా లేదా అనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయానికి రావాలని నిపుణులు చెబుతున్నారు.

Read Latest and NRI News

Updated Date - Jan 17 , 2025 | 09:38 PM