Share News

UAE: యుఏఈలో సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:48 PM

ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

UAE: యుఏఈలో సంక్రాంతి సంబరాలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఇల్లు విడిచి విదేశాలకు వచ్చిందే డబ్బు కొరకు, అయినా డబ్బే ప్రధానం కాకుండా ఆచార, వ్యవహారాల సమ్మేళనాల్లో భాగమైన పండుగలే మనుషులకూ, సమాజానికి మధ్య అనుబంధాల వారధులు. కలిసిమెలిసి బతికేలా తరతరాల బంధాలకు అర్థం చెబుతూ ఊళ్లకు ఊళ్లు సందోహంగా కదిలే సాంస్కృతిక సంబరానికి ఆనవాళ్లే సంక్రాంతి సంబరాలు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ పెద్ద పండుగలో ఆచార వ్యవహారాలు స్వదేశంలో కాలక్రమేణా కనుమరుగవతున్నా ఎక్కడో విదేశాలలో అందునా అరబ్బు దేశాలలో మాత్రం సంప్రదాయబద్ధంగా దీన్ని నిర్వహిస్తున్నారు (NRI).

2.jpg


Sankranti Celebrations: జపాన్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయి, షార్జా, రాస్ అల్ ఖైమా, ఆజ్మాన్ ఇతర ఎమిరేట్లకు చెందిన తెలుగు ప్రవాసీ కుటుంబాలు యూఏఈలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను పూర్తిగా ఆధ్యాత్మికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుప్రభాతం, తిరుప్పావై, విష్ణుసహస్రనామ పారాయణంతో పాటు భోగి మంటలు, బొమ్మల కొలువు, శ్రీ వేంటేశ్వర స్వామి కళ్యాణం, ఉత్తరద్వార దర్శనం, గరుడవాహన సేవ, భోగి పళ్ళు, రంగవల్లుల, చిన్నారుల హరిదాసు పాటలు, భరతనాట్యం, గాలిపటాల పోటీలు నిర్వహించడంతో సభికులు ఆహ్లాదం పొందారు. కళ్యాణ మహోత్సవం, అర్చనలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా కొనసాగాయి.

3.jpg


వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు తరంగిణి నిర్వహించిన వైకుంఠ ఉత్తరద్వార దర్శనం, హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన పురోహితులు భరద్వాజ శర్మ, దుబాయిలోని పురోహితులు ముకుంద కౌశిక్ శాస్త్రోకంగా నిర్వహించిన శ్రీ వేకంటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం, అర్చనలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా కొనసాగాయి. ఏడు కొండల్లో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నకు సమర్పించే నైవేద్యాల్లో ప్రధానమైన లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆదరిస్తారు. తిరుపతి నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలను అందించడంతో భక్తులు పులకించిపోయారు.

Kishan Reddy: సౌదీకి వెళ్లిన కిషన్ రెడ్డికి నీరాజనం..

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, శాసన సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా భోగిపళ్ళతో చిన్నారులను ఆశీర్వదించారు.

సాత్విక ఉపాహారం, భోజనం ఏర్పాట్లు, నన్మా గ్రూప్ సన్నాయి మేళం, చెండ మేళం సభికులను ఆకట్టుకొన్నాయి.

కార్యక్రమంలో దుబాయి తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు బి. వివేకానంద, ప్రధాన కార్యదర్శి కె. విజయభాస్కర్ రెడ్డి, డైరెక్టర్ ఫహీం, నూకల మురళీకృష్ణ, దామర్ల శ్రీధర్, ప్రెట్టి తెలుగు ఉమెన్ అధ్యక్షురాలు ఫ్లోరెన్స్ విమల, ఆబుధాబి తెలుగు అసోసియేషన్ పక్షాన రవి తదితరులు పాల్గొన్నారు.

4.jpg


ఈ వేడుకలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇస్కాన్, నన్మా, తమిళ మండ్రం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐ.పి.యఫ్, కన్నడ అసోసియేషన్, సమన్వయ సంఘాల ప్రతినిధులు పాల్గొని నిర్వహకులను అభినందించారు.

రెండు వేలకు పైగా కుటుంబాలు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని తెలుగు తరంగిణి ఉపాధ్యక్షులు శ్రీనివాస రావు, కోశాధికారి రాజేశ్, ప్రధాన కార్యదర్శి నంద మరియు బ్రహ్మ, రామ శేషు, వీర, లక్ష్మణరావు, శరత్, వీరేంద్ర, శివానంద, సైదారెడ్డి, కేదార్, విజయ, అనిల్, కిరణ్, డాక్టర్ రాఘవేంద్రలతో పాటు తనదైన శైలీతో వ్యాఖ్యాతగా వ్యవహరించిన సురేఖ పట్నంలను అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేశ్ అభినందించారు.

5.jpg

అన్ని పండుగల తరహా సంక్రాంతి మూడు రోజుల ముచ్చటైన పండుగలో మగువలు కీలకం, మొత్తం యూఏఈలో తెలుగు మహిళలకు పెద్ద పీఠం వేస్తూ సాధారికత సంకల్పించే తెలుగు తరంగిణి నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మహిళా మూర్తులు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. శోభారాణి, విజయ లక్ష్మి, తనూజ,వరలక్ష్మి, ప్రియాంక, రేవతి, హంసవేణి, భాగ్యశిరీష, అనంత లక్ష్మి, ప్రణవిలు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు

తెలుగు తరంగిణి దశాబ్ది ఉత్సవాలు ఈ సంక్రాంతితో ప్రారంభమయి మార్చి 31న జరిగే ఉగాది ఉత్సవాల వరకు కొనసాగుతాయని వెంకట సురేశ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

6.jpg7.jpgRead Latest and NRI News

Updated Date - Jan 16 , 2025 | 04:49 PM