Sankranti Celebrations: జపాన్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 02:52 PM
తెలుగువారి పండుగల ఖ్యాతి ఖండాంతరాలను తాకుతోంది. ఉద్యోగరీత్యా జపాన్‌లో స్థిరపడిన ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అక్కడ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

ఎన్నారై డెస్క్: తెలుగువారి పండుగల ఖ్యాతి ఖండాంతరాలను తాకుతోంది. ఉద్యోగరీత్యా జపాన్‌లో స్థిరపడిన ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు అక్కడ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నెల 13, 14, 15 తేదీల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (తాజ్) ఆధ్వర్యంలో హిగాషి ఒజీమాలో ఈ వేడుకలు జరిగాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పిల్లలకి డ్రాయింగ్, పెద్దలకు కబడ్డీ, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. జపాన్ వీధుల్లో తెలుగు మహిళలు వేసిన రంగవల్లులు తిలకించేందుకు అక్కడి వారు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు (NRI).
Kishan Reddy: సౌదీకి వెళ్లిన కిషన్ రెడ్డికి నీరాజనం..
ముఖ్యంగా పతంగుల పండుగపై జపనీయులు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించినట్టు వెల్లడించారు. ఈ పండుగను ఏటా నిర్వహిస్తున్నప్పటికీ అది తెలుగు వారికి మాత్రమే పరిమితమయ్యేది. అయితే, ఈ ఏడాది సంక్రాంతిలో జపనీయులు ఎక్కువ మంది పాల్గొని వేడుకను జరుపుకున్నారు. మూడు రోజుల సంక్రాంతి సంబరాల పుణ్యమా అని జపాన్‌లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు అందరూ ఒకే చోట చేరడంతో తమకు సొంత గ్రామాల్లోనే ఉన్న అనుభూతి కలిగిందన్నారు. ప్రతి పండుగను క్రమం తప్పకుండా నిర్వహించి వాటిల్లో జపనీయులను భాగం చేస్తామని అన్నారు.