ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

NRI: అమెరికాలో సంగీత ప్రియులకు గుడ్‌న్యూస్.. తానా కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్

ABN, Publish Date - Jan 26 , 2025 | 10:14 AM

అమెరికాలో ఉంటూ సంగీత కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తిఉన్నవారికోసం అమెరికాలోని తానా కళాశాల ప్రత్యేక సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. 2024-2025 సంవత్సరం కోసం ప్రవేశాలకు తానా కళాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది.

Tana

అమెరికాలో ఉంటూ సంగీత కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తిఉన్నవారికోసం అమెరికాలోని తానా కళాశాల ప్రత్యేక సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. 2024-2025 సంవత్సరం కోసం ప్రవేశాలకు తానా కళాశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో గల శ్రీ పద్మావతి మహిళా విశ్వావిద్యాలయం భాగస్వామ్యంతో తానా కళాశాల ఈ కోర్సులను అందిస్తోంది. సంగీతం, నృత్యం (భరతనాట్యం, కూచిపూరి, కర్ణాటక సంగీతం) విభాగాల్లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు అందిస్తోంది. సంగీతం, నృత్యంలో ఆసక్తిఉన్న విద్యార్థులు https://kalasala.tana.org/ registration లింక్‌ ద్వారా తమపేర్లను రిజిస్టర్ చేసుకోవాలని తానా కళాశాల ఛైర్‌పర్సన్ మాలతి నాగభైరవ, కో చైర్ పర్సన్ రవీంద్ర చిట్టూరి తెలిపారు.


పద్మావతి విశ్వవిద్యాలయం ద్వారా..

భారత్‌లోని ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి డిప్లోమా కోర్సులు అందిస్తున్నట్లు తానా కళాశాల ప్రతినిధులు వెల్లడించారు. అమెరికాలోని పిల్లల జీవనశైలి, విద్యా బోధన దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సులు రూపొందించినట్లు తెలిపారు. మీకు నచ్చిన గురువుతో మీరు కోర్సులో శిక్షణ పొందవచ్చు. ఎంతో ప్రసిద్ధి చెందిన గురువులతో కోర్సు బోధన జరుగుతుంది. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుందని తానా కళాశాల ప్రతినిధులు తెలిపారు.


మహిళలకు మాత్రమే..

సంగీత, నృత్య కోర్సుల్లో చేరిన విద్యార్థులకు కనీసం వారానికి రెండు గంటలు థియరీ, రెండు గంటలు ప్రాక్టికల్స్ బోధన ఉంటుంది. డిప్లొమా కోర్సు ఒక సంవత్సరం పూర్తి చేసిన తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికెట్ అందజేస్తారని తానా కళాశాల ప్రతినిధులు తెలిపారు. మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, కనీస వయసు పదేళ్లు ఉండాలని తెలిపారు. సంగీతం, నృత్యం కోర్సుల్లో చేరేందుకు గరిష్ట వయో పరిమితి ఏమి లేదన్నారు. మరిన్ని వివరాల కోసం www.tana .org‌ వెబ్‌సైను సందర్శించవచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Jan 26 , 2025 | 10:26 AM