PM Modi speaks to Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్ కాల్ సంభాషణ
ABN, Publish Date - Jan 27 , 2025 | 09:19 PM
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ట్రంప్‌తో మాట్లాడిన విషయాన్ని మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi ) ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ట్రంప్‌తో మాట్లాడిన విషయాన్ని మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. సంబంధిత వర్గాలు కూడా ఈ విషయమై ప్రకటన విడుదల చేశాయి. ట్రంప్‌ను ప్రధాని మోదీ అభినందించడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించినట్టు పేర్కొన్నారు (PM Modi speaks to Donald Trump).
``నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. రెండోసారి విజయం సాధించి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్‌ను అభినందించా. ఇరు దేశాల స్నేహం, ప్రయోజనాల విషయంలో మేం కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. ఇరు దేశాల ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, సమగ్రత కోసం కలిసి ముందుకు వెళ్తామ``ని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడి ప్రవాస భారతీయులకు కలవరం కలిగిస్తున్నాయి (USA News).
అమెరికాలో జన్మత: లభించే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఇటీవల ట్రంప్ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ``అక్రమ వలసదారులకు జన్మించే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు`` అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో అక్కడ నివసించే కొందరు భారతీయులు కలవరపాటుకు గురవుతున్నారు. కాగా, న్యాయపరంగా వలస వెళ్లిన వారికి మాత్రమే తాము మద్ధతుగా నిలుస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్లిన వారిని చట్టబద్ధంగా వెనక్కి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 27 , 2025 | 09:19 PM