ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పటేల్ ప్రమాణస్వీకారం

ABN, Publish Date - Feb 22 , 2025 | 07:22 AM

ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసి ఆయన ఎఫ్‌బీఐ బాధ్యతలను స్వీకరించారు.

ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ శనివారం అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ భగవద్గీత‌పై చేయి వేసి ప్రమాణం చేశారు. వైట్ హౌస్ క్యాంపస్‌లో ఉన్న ఐసన్‌హావర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలోని ఇండియన్ ట్రీటీ రూంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ ఆయనతో ప్రమాణం చేయించారు (NRI).

FBI Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్‌ పటేల్‌ ఎంపికను ఆమోదించిన అమెరికా సెనెట్


ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్ పటేల్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘ఎఫ్‌బీఐ ఏజెంట్స్ కాశ్‌ను ఎంతో గౌరవిస్తారు. ఆయనను డైరెక్టర్‌గా ఎంపిక చేయడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. ఈ పదవి చేపట్టిన అత్యుత్తమ వ్యక్తిగా కాశ్ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన నియామకం కోసం చాలా సులువుగా ఏకాభిప్రాయం సాధించగలిగాను. అతడు చాలా టఫ్. కాశ్ గొప్ప వ్యక్తి అని టామ్ గౌడీ కూడా అన్నారు. దీంతో, నాకున్న సందేహాలన్నీ తొలగిపోయాయి. మితవాదిగా అందరి గౌరవం పొందిన టామ్ గౌడీ కాశ్‌కు మద్దతుగా నిలవడం గొప్ప విషయం’’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

కాగా, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పటేల్ నియామకాన్ని అమెరికా సెనెట్ గురువారం 51-49 తేడాతో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇద్దరు డెమొక్రాట్స్ మాత్రం ఆయన నియామకానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాశ్ పటేల్ గతంలో కౌంటర్ టెరరిజమ్ విభాగం ప్రాసిక్యూటర్‌గా, రక్షణ శాఖ మంత్రికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు. పలు సందర్భాల్లో ఎఫ్‌బీఐ తీరును విమర్శించారు. అయితే, కాశ్ నేతృత్వంలో ఎఫ్‌బీఐ స్వతంత్రంగా పనిచేయకపోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.


Visa On Arrival Facility: యూఏఈ వెళదామనుకుంటున్నారా? మీకో అలర్ట్!

కాగా ట్రంప్ 2017లో క్రిస్టొఫర్ వ్రేను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియమించారు. అయితే, ట్రంప్‌తో అభిప్రాయభేదాల కారణంగా ఆయన రాజీనామా చేశారు. సాధారణంగా ఎఫ్‌బీఐ కార్యకలాపాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించేందుకు ఎఫ్‌బీఐ డైరెక్టర్లను 10 ఏళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. అయితే, ట్రంప్‌కు పటేల్ విశ్వాసపాత్రుడు కావడంతో ఎఫ్‌బీఐ స్వతంత్రంగా పనిచేస్తుందా అన్న సందేహాలను అక్కడి రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పటేల్ డైరెక్టర్ అయితే ఎఫ్‌బీఐ విశ్వసనీయత దెబ్బతింటుందని ప్రతిపక్ష డెమోక్రటిక్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని నిలబెడతానని పటేల్ పేర్కొన్నారు. ‘‘డైరెక్టర్‌గా నా లక్ష్యంప స్పష్టత ఉంది. ఎఫ్‌బీఐపై నమ్మకాన్ని నిలబెట్టాలి’’ అని ఇటీవల ఆయన పేర్కొన్నారు.

Read Latest and NRI News

Updated Date - Feb 22 , 2025 | 07:31 AM