Share News

FBI Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్‌ పటేల్‌ ఎంపికను ఆమోదించిన అమెరికా సెనెట్

ABN , Publish Date - Feb 21 , 2025 | 07:45 AM

అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌‌బీఐ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాశ్‌ పటేల్‌ ఎంపికకు అమెరికా సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.

FBI Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్‌ పటేల్‌ ఎంపికను ఆమోదించిన అమెరికా సెనెట్

ఇంటర్నెట్ డెస్క్‌: చరిత్రలో తొలిసారిగా అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ పగ్గాలను ఓ భారత సంతతి నేత చేపట్టనున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్ ‘కాష్’ పటేల్‌ ఎంపికను ఖరారు చేస్తు అమెరికా పెద్దల సభ సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. రిపబ్లికన్ సెనెటర్లు అందరూ ఆయనకు మద్దతుగా నిలిచినా సుసన్ కోలిన్స్, లిసా ముర్కోవ్క్కీ మాత్రం మాత్రం డెమోక్రాట్ల పక్షం వహిస్తూ కాశ్‌ పటేల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పటేల్, రాజకీయాలకు అతీతంగా ఎఫ్‌బీఐ పనిచేస్తుందని తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండవని హామీ ఇచ్చారు. ఎఫ్‌బీఐపై ప్రజల్లో నమ్మకం మరింత పెంచడమే తన లక్ష్యమని అన్నారు. అమెరికాకు హాని తలపెట్టే వారు ప్రపంచంలో ఏమూలన దాగి ఉన్నా వేటాడి మరీ మట్టుపెడతామని హెచ్చరించారు (NRI). డొనాల్డ్ ట్రంప్‌కు నమ్మినబంటుగా కాశ్‌ పటేల్‌కు పేరుంది.


Visa On Arrival Facility: యూఏఈ వెళదామనుకుంటున్నారా? మీకో అలర్ట్!

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచీ ప్రభుత్వ ప్రధాన శాఖల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. న్యాయశాఖ, ఎఫ్‌బీఐలో దాదాపు 75 మంది లాయర్లు, ఇతర అధికారులు ట్రంప్ అధికారం చేపట్టాక రాజీనామా చేశారు. వీరిలో కొందరిని ట్రంప్ ప్రభుత్వం స్వయంగా తొలగించగా మరికొందరిని ఇతర విభాగాలకు బదిలీ చేసింది. కేవలం నెల వ్యవధిలో ఈ స్థాయిలో మార్పులు చోటుచేసుకోవడం అక్కడి వర్గాల్లో కలకలం రేపుతోంది.

ట్రంప్ విధానాలను, లక్ష్యాలకు అనుగూణంగా తమ చర్యలు ఉంటాయని న్యాయ శాఖ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అక్రమ వలసల విధానంలో ట్రంప్‌కు వత్తాసు పలికి ప్రతిపక్ష డెమోక్రటిక్ నేత, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌పై అవినీతి కేసును ఎత్తేసేందుకు న్యాయశాఖ సిద్ధమైంది.


Rishi Sunak: తాజ్‌మహల్‌ను సందర్శించిన బ్రిటన్ మాజీ ప్రధాని సునాక్!

న్యాయశాఖ పనితీరుపై డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తు్న్నారు. 2016 నాటి ఆయన ప్రచార కార్యక్రమాలు, మరో రెండు ఫెడరల్ క్రిమినల్ కేసులను న్యాయశాఖ ట్రంప్‌పై నమోదు చేసింది. అయితే, విచారణకు రాకమునుపే వాటిని పక్కన పెట్టేసింది. ‘‘ప్రమాదకరమైన నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడమే ప్రధాన అజెండాగా న్యాయ శాఖ ముందుకెళుతుంది. రాజకీయ దురుద్దేశాలతో రంధ్రాణ్వేషణకు దిగదు’’ అని ఆ శాఖ అధికారి ఛాడ్ మిజిల్ గత వారం స్పష్టం చేశారు. అయితే, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లులేవని గతంలో ట్రంప్ కేసులపై పని చేసిన అధికారులు పేర్కొన్నారు.

Read Latest and NRI News

Updated Date - Feb 21 , 2025 | 12:35 PM