ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెదడు దెబ్బతినకుండా...

ABN, Publish Date - Mar 04 , 2025 | 06:43 AM

దైనందిన జీవితంలో మనం అనుసరించే కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ ఉంటాయి. నిరంతరం మెదడు చురుగ్గా ఉండాలంటే ఆ అలవాట్లకు...

తెలుసుకుందాం

మెదడు దెబ్బతినకుండా...

దైనందిన జీవితంలో మనం అనుసరించే కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ ఉంటాయి. నిరంతరం మెదడు చురుగ్గా ఉండాలంటే ఆ అలవాట్లకు స్వస్థి చెప్పాలి.

ఎక్కువ సేపు కూర్చుంటే: గంటల తరబడి కదలకుండా కూర్చోడానికీ, జ్ఞాపకశక్తికి కీలకమైన మెదడులోని ఒక భాగంలో మార్పులకూ సంబంధం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆ ప్రభావాన్ని తగ్గించడం కోసం ప్రతి గంటకూ లేచి నిలబడి కనీసం ఐదు నిమిషాల పాటైనా నడుస్తూ ఉండాలి.

సరిపోని నిద్ర: కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రాభంగం కలగకుండా కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర లోపిస్తే, జ్ఞాపకశక్తితో పాటు, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి రాత్రి నిద్రకు రెండు గంటల ముందు నుంచి మెదడును మెలకువగా ఉంచే ఫోన్లు, టివిలకు దూరంగా ఉండాలి.


ఒంటరితనం: మెదడు ఆరోగ్యానికి ఒంటరితనం ప్రమాదకరం. తరచూ ఇతరులతో కలుస్తూ కాలక్షేపం చేస్తూ ఉండడం వల్ల మెదడు చైతన్యమవుతూ చురుగ్గా ఉంటుంది. ఒంటరితనంలో బయటి నుంచి ప్రేరణ లోపించడం మూలంగా మానసిక కుంగుబాటు, ఆందోళన, మతిమరుపు సమస్యలు వేధిస్తాయి. కాబట్టి తరచూ స్నేహితులు, కుటుంబసభ్యులతో సరదా సమయాలు గడుపుతూ ఉండాలి.

మోతమోగే హెడ్‌ఫోన్స్‌: సంగీతం వినడం ద్వారా సేద తీరడం మంచిదే కానీ, చెవులు మోతమోగేలా పెద్ద శబ్దంతో హెడ్‌ఫోన్స్‌లో పాటలు వినడం వల్ల మెదడుకు చేటు జరుగుతుంది. పెద్ద శబ్దాలు వినికిడి లోపం సమస్యకు దారి తీస్తాయి. వినికిడి లోపం క్రమేపీ డిమెన్షియా, అల్జీమర్స్‌ వ్యాధులకు దారి తీస్తుంది.



మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు

Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 04 , 2025 | 06:43 AM