Share News

Telangana CM Change: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

ABN , Publish Date - Mar 03 , 2025 | 07:48 PM

Telangana CM Change: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు తథ్యమని తెలంగాణ ఎమ్మెల్యే స్సష్టం చేశారు. ఆ ఆపరేషన్ కోసమే తెలంగాణ కొత్త ఇన్ ఛార్జీగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేట్టారని స్పష్టం చేశారు. మరికొద్ది మాసాల్లో ఈ సీఎం మార్పు ఉంటుందన్నారు. అలాగే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకకుండా ఆయన కేబినెట్‌లోని మంత్రి కీలకంగా వ్యవహరిస్తున్నారని గుట్టు విప్పారు.

 Telangana CM Change: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..
MLA Alleti Maheshwar Reddy

హైదరాబాద్, మార్చి 03: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇన్‌చార్జీ మారిందంటే ఇంకా మారేది సీఎం రేవంత్ రెడ్డేనని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘మిషన్ సీఎం చేంజ్’ టాస్క్‌ను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించారని తెలిపారు. అయితే గతంలో తాను ఇదే విషయాన్ని స్పష్టం చేశానని ఆయన పేర్కొ్న్నారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్‌లోపు ముఖ్యమంత్రి మార్పు తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. కుంభకోణాలతోపాటు ఇతర ట్యాక్స్‌లపై కాంగ్రెస్ పార్టీలో కథలు, కథలుగా చెప్పుకొంటున్నారన్నారు. అయితే కేబినెట్‌లో కలహాలు నడుస్తున్నాయని తెలిపారు.

ఆడబిడ్డల ఆశీర్వాదం అంటే తెలంగాణ ఆడబిడ్డలు కాదని.. ఢిల్లీ ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ చేతిలో తన భవిష్యత్తు ఉందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. సీఎం మార్పుపై గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చి కేబినెట్‌లోని ఓ నేతలకు ఆ బాధ్యతను అప్పగిస్తారని వివరించారు. మొన్నటి వరకు కన్వర్టెడ్ బీసీ అన్నారని ఆయన గుర్తు చేశారు.


ఇక సీఎం రేవంత్ రెడ్డి నరం లేని నాలుక ... ఎప్పుడు ఏమైనా మాట్లాడుతాడంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుతో పాటు కేబినెట్‌సైతం గాడి తప్పిందని విమర్శించారు. మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నారన్నారు. రాజు.. సామంత రాజు తరహాలో వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక్క మంత్రి సైతం తనను లెక్క చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పుకున్నారని గుర్తు చేశారు.

Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్


ఫిబ్రవరి 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాడని... దాదాపు ఆరేడు నెలల తర్వాత పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇచ్చారని వివరించారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఎవరో తన కుర్చీపై కన్నేశారని చెప్పడమంటే.. రాహుల్ గాంధీ ఎలాంటి ఇండికేషన్ ఇచ్చారో అర్థమవుతుందన్నారు. కొందరు మంత్రులు తన సీఎం కుర్చీపై కన్నేశారని.. కేబినెట్ మంత్రులు తన మాట వినడం లేదన్నారు. సీఎంను పని చేయనీయకుండా, ఆయన కుర్చీపై కన్నేసిందెవరని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్


భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు.. ఈ కుర్చీపై కన్నేశారా? అని సందేహం వ్యక్తం చేశారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి వారు సహకరించడం లేదా? అని సందేహం వ్యక్తం చేశారు. వీరి మధ్య మూటల పంచాయితితోనేనా లేక మరేదైనా కారణముందా? అని ప్రశ్నించారు. ఆ క్రమంలోనే సీఎంను ఎస్ఎల్బీసీ వద్దకు రానీయ లేదన్నారు. తాము వెళ్లి స్టేట్‌మెంట్ ఇస్తే.. ఆ తర్వాత 8 రోజులకు దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారన్నారు.

Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు


సీఎంకు ఎక్కడికక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఎప్పటి సమాచారాన్ని అప్పుడు ఢిల్లీకి చేరవేస్తున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారన్నారు. అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో అపాయింట్‌మెంట్ దొరకకుండా చేస్తున్నది సైతం ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని గుర్తు చేశారు.

Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..


తెలంగాణలో పార్టీ ఇన్‌ఛార్జీని మార్చడంలో ప్రధాన భూమిక, మాస్టర్ ప్లాన్ అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డిదేనని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డితో గిఫ్ట్‌లు తీసుకొని సపోర్ట్ చేస్తుందని ఓ చర్చ సైతం పార్టీలో సాగుతోందన్నారు.

For Telangana News And Telugu News..

Updated Date - Mar 03 , 2025 | 07:48 PM