Cotton Sarees: పసందైన ప్యాచ్ వర్క్
ABN, Publish Date - May 21 , 2025 | 07:28 AM
వినూత్న ప్యాచ్‌వర్క్‌తో కూడిన కాటన్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కలంకారి, ఇక్కత్ ప్యాచ్‌లతో ప్లెయిన్ చీరలకు ఆకర్షణीयమైన లుక్ వస్తుంది.
ఎరుపు, పసుపు... ఆకుపచ్చ, నీలం... నలుపు, ఎరుపు.. కాంట్రాస్ట్ డిజైన్లు బాగుంటాయి
సాదాసీదా చీరలకు బదులుగా ‘ప్యాచ్ వర్క్’ చేసిన వినూత్నమైన చీరలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. కాంట్రాస్ట్ రంగులతో, అందమైన డిజైన్ల రూపంలో ప్యాచ్ వర్క్ చేసిన ఆ కాటన్ చీరలు ఇవే!
పువ్వులు, లతల డిజైన్లతో కూడిన కాటన్ చీరకు, అంచుల వెంబడి కాంట్రాస్ట్ కలర్ ప్యాచ్‌ను జతచేస్తే ఆ చీర లుక్ పూర్తిగా మారిపోతుంది. అదనపు ఆకర్షణ కూడా తోడవుతుంది.
ప్యాచ్‌వర్క్‌ను పోలిన మ్యాచింగ్ బ్లౌజ్ ధరిస్తే, చీరకు అందం వస్తుంది. అయితే చీరకట్టుకు నప్పేలా బ్లౌజ్ నెక్ డిజైన్ జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఓవల్, రౌండ్ షేప్ నెక్ డిజైన్లు బాగుంటాయి.
ప్లెయిన్ కలర్ చీరకు, కాంట్రాస్ట్ కలర్ అంచు ఒక్కటే సరిపోదు. చీర రంగును పోలిన డిజైను అంచులో ఉండి తీరాలి. అప్పుడే ప్యాచ్‌వర్క్ నలుగురి కళ్లనూ ఆకర్షిస్తుంది
ప్యాచ్ వర్క్ మరీ పెద్దవైతే ఎబ్బెట్టుగా ఉంటుంది. మరీ చిన్నవిగా ఉంటే స్పష్టంగా కనిపించవు. కాబట్టి ప్రత్యేకంగా కనిపించే డిజైన్లనే ఎంచుకోవాలి
ఫప్లెయిన్ కాటన్ చీర మీద, కలంకారి, ఇక్కత్ వస్త్రపు ప్యాచ్ వర్క్ తాజా ఫ్యాషన్. కాబట్టి ఇలాంటి చీరలే ఎంచుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News
Updated Date - May 21 , 2025 | 07:33 AM