ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాంసకృత్తులు మన భోజనంలోనే...

ABN, Publish Date - Mar 04 , 2025 | 06:48 AM

నిజానికి వృక్షాధారిత పదార్థాలను సమపాళ్లలో తీసుకోగలిగితే సరిపడా ప్రొటీన్‌ను సమకూర్చుకోవచు ్చ. అదెలాగో తెలుసుకుందాం!...

మాంసకృత్తులు

మన భోజనంలోనే...

పోషకాహార లోపం

భారతీయ భోజనంలో మాంసకృత్తుల లోటు ఉంటుందన్నది అపోహ మాత్రమే!

నిజానికి వృక్షాధారిత పదార్థాలను సమపాళ్లలో తీసుకోగలిగితే సరిపడా ప్రొటీన్‌ను సమకూర్చుకోవచు ్చ. అదెలాగో తెలుసుకుందాం!

తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలతో కూడిన సంప్రదాయ భారతీయ భోజనాలన్నీ ప్రధానంగా వృక్షాధారితమైనవే! అలాగని భారతీయ భోజనంలో మాంసకృత్తులు లోపించాయనుకుంటే పొరపాటు. వృక్షాధారిత పదార్థాల్లో కూడా ప్రొటీన్‌ పుష్కలంగా దొరికే పదార్థాలను భోజనంలో ఉండేలా చూసుకుంటే మాంసకృత్తుల లోపాన్ని నియంత్రించుకోవచ్చు.


మాంసకృత్తుల అవసరత వయసు, శరీర బరువు రోజువారీ పనుల ఆధారంగా మాంసకృత్తుల మోతాదును ఎవరికి వారు లెక్కించుకోవాలి. ఇందుకోసం పోషకాహార నిపుణుల సహాయం తీసుకోవచ్చు. వారి సలహాల ఆధారంగా సరిపడా మాంసకృత్తులు సమకూరే భోజనాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలి. స్థానికంగా లభించే ఎన్నో ఆహారపదార్థాల్లో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. అవేంటంటే...

కాయధాన్యాలు: కందిపప్పు, పెసరపప్పు, సెనగపప్పు, ఎర్ర కందిపప్పు

చిక్కుళ్లు, పప్పులు: సోయా బీన్స్‌, రాజ్మా, అలసందలు

పాల ఉత్పత్తులు: పెరుగు, జున్ను, పనీర్‌, నెయ్యి చిరుధాన్యాలు, తృణ ధాన్యాలు: రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, గోధుమలు గింజలు, విత్తనాలు: బాదం, నువ్వులు, పొద్దుతిరుగుడు, గుమ్మడి విత్తనాలు


స్నాక్స్‌:

  • వేరుసెనగలు, సెనగపప్పు, మొలకలు

  • పుట్టగొడుగులు, టోఫు

  • అవకాడొ లెక్కలేనన్ని అపోహలు

  • ప్రొటీన్‌ పరంగా భారతీయ భోజనం చుట్టూరా ఎన్నో అపోహలు అలుముకుని ఉన్నాయి. ఆ అపోహలు, వాస్తవాల గురించి తెలుసుకుందాం!

  • భారతీయ భోజనంలో ప్రొటీన్లు పరిమితమనే అపోహ ప్రచారంలో ఉంది. కానీ పప్పుధాన్యాలు, మొలకలు, తృణధాన్యాలలో ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటుంది.

  • శాకాహారుల భోజనంలో ప్రొటీన్‌ లోపిస్తుందన్నది కూడా అపోహే! పనీర్‌, సెనగలు లాంటి వాటిని భోజనంలో చేర్చుకోవడం ద్వారా ప్రొటీన్‌ను తేలికగా భర్తీ చేసుకోవచ్చు.

  • అధిక ప్రొటీన్‌ మూత్రపిండాలకు హానికరం. ముందు నుంచీ మూత్రపిండాల సమస్యలున్నవారికి అధిక ప్రొటీన్‌ చేటు చేస్తుంది తప్ప, ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు ప్రొటీన్‌ ఎటువంటి చేటూ చేయదు.

భోజనం ప్రణాళికాబద్ధంగా...

ప్రొటీన్‌ లోపం తలెత్తకుండా ఉండాలంటే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో సరిపడా ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం....


బ్రేక్‌ఫాస్ట్‌ ఇలా...

గుడ్లు: ఉడికించినవి, శ్ర్కాంబుల్‌ చేసినవీ, లేదా కూరగాయ ముక్కలతో కలిపి ఆమ్లెట్‌ వేసి తినొచ్చు

పెరుగుతో: బెర్రీస్‌, నట్స్‌ కలుపుకుని తినొచ్చు

కాటేజ్‌ చీజ్‌: పండ్ల ముక్కలు కలుపుకుని తినొచ్చు. లేదా కూరగాయలతో కలిపి తినొచ్చు

ప్రొటీన్‌ స్మూదీస్‌: బాదం పాలు, అరటిపండు, షియా విత్తనాలు కలిపి తాగొచ్చు

టోఫు: టోఫు, కూరగాయ ముక్కలను వేయించుకుని తినొచ్చు

ఓట్స్‌: ఓట్స్‌, షియా విత్తనాలను కలిపి రాత్రంతా నీళ్లలో నానబెట్టుకుని, ఉదయాన్నే పండ్ల ముక్కలతో కలిపి తినొచ్చు

లంచ్‌లో...

పప్పుధాన్యాలు: కందిపప్పు లేదా పెసలతో పప్పు వండుకుని, అన్నంతో, రోటీతో తినొచ్చు. పప్పుకు కూరగాయలు, ఆకుకూరలు జోడించుకోవాలి.

కాబూలీ చనా: నానబెట్టి ఉడికించుకుని సలాడ్‌తో కలిపి తినొచ్చు. టమాటాలతో కలిపి వండుకుని, అన్నంతో, రోటీతో తినొచ్చు

కాటేజ్‌ చీజ్‌: షాహి పనీర్‌, పనీర్‌ టిక్కా, పాలక్‌ పనీర్‌లను రోటీ లేదా అన్నంతో కలిపి తినొచ్చు

మూంగ్‌ దాల్‌ చిల్లా: పెసరపప్పు దోసె, పెరుగుతో, కూరలతో కలిపి తినొచ్చు

రాజ్మా లేదా కడి: ఈ రెండూ వంటకాలూ అన్నంతో, రోటీతో తినొచ్చు

ఢోక్లా: సెనగపిండితో తయారయ్యే ఈ గుజరాతీ వంటకం బలవర్థకవె ుౖనది. తేలికపాటి లంచ్‌లో భాగంగా ఢోక్లాను చట్నీతో కలిపి తినొచ్చు

సోయా చంక్స్‌: కూరలా వండుకుని తినొచ్చు. కూరగాయలతో కలిపి వేయించుకుని తినొచ్చు

పచ్చి బఠాణీ: వీటితో పులావ్‌ వండుకోవచ్చు. పనీర్‌తో కలిపి కూర తయారుచేసుకుని రోటీ, అన్నంతో తినొచ్చు.

డిన్నర్‌ ఇలా...

పనీర్‌ టిక్కా: పుదీనా చట్నీతో కలిపి తినొచ్చు లేదా దోస, టమాటా సలాడ్‌తో కలిపి తినొచ్చు

పెసరపప్పు: రోటీ లేదా అన్నంతో కలిపి తినొచ్చు

కిచిడి: క్యారట్స్‌, పచ్చి బఠాణీ, పాలకూర, పెసరపప్పు, బియ్యంతో తయారుచేసుకునే కిచిడి బలవర్థకమైన ఆహారం

చనా మసాలా: బ్రౌన్‌ రైస్‌, క్వినోవా లేదా పొట్టుతీయని గోధుమపిండితో తయారుచేసిన రోటీలతో కలిపి తినొచ్చు

పాలక్‌ పనీర్‌: రోటీలు, అన్నంతో కలిపి తినొచ్చు.



మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు

Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు

Also Read: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..

Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్

Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్

Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 04 , 2025 | 06:48 AM