Bindi Styles: బొట్టు ఇలా...
ABN, Publish Date - May 29 , 2025 | 06:05 AM
ముఖాకృతికి అనుగుణంగా బిందీ ఎంచుకుంటే ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గుండ్రటి, దీర్ఘవృత్త, చతురస్ర, కోల, హృదయాకార ముఖాలకు తగిన బిందీ రకాల వివరాలు ఇందులో ఉన్నాయి.
మహిళలు సాధారణంగా గుండ్రని బొట్టు లేదా చిన్న బిందీ పెట్టుకుంటారు. పార్టీలు, వివాహాది శుభకార్యాలు... ఇలా సందర్భాన్ని అనుసరించి రకరకాల బిందీలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ముఖాకృతికి తగ్గట్టుగా బిందీని పెట్టుకుంటే ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఎవరికి ఏ రకం బిందీ బాగుంటుందో తెలుసుకుందాం...
గుండ్రని ముఖం ఉన్నవారు పొడవాటి బిందీని పెట్టుకోవాలి. దీనివల్ల ముఖం కొద్దిపాటి కోలగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చిన్న కుందనాలు లేదా మెరిసే రాళ్లు ఉన్న బిందీలు వీరికి బాగా నప్పుతాయి.
దీర్ఘవృత్తాకారపు ముఖం ఉన్నవారికి నుదురు పెద్దగా ఉంటుంది. వీరికి అన్ని రకాల బిందీలు చక్కగా నప్పుతాయి. మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఉన్న బిందీని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. బంగారు రంగు గుండ్లు అమర్చిన బిందీలు వీరికి ప్రత్యేకమైన అందాన్నిస్తాయి.
చతురస్రాకారపు ముఖం ఉన్నవారికి నుదుటితోపాటు చెక్కిళ్లు కూడా వెడల్పుగా ఉంటాయి. వీరు గుండ్రంగా ఉండే పెద్ద బిందీలు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు. బిందీ కింది భాగంలో చిన్న రాయి లేదా పూస ఉండేలా చూసుకుంటే ముఖం ఆకర్షణీయంగా ఉంటుంది.
కోల ముఖం ఉన్నవారికి వెడల్పాటి డిజైన్ల బిందీలు, అర్థచంద్రాకారంలో ఉన్నవీ బాగా నప్పుతాయి. వీటివల్ల ముఖం సమతుల్యంగా కనిపిస్తుంది. వీరికి మెరిసే రాళ్లు ఉన్న బిందీలు బాగుంటాయి. బిందీ కింద చిన్న చుక్క అదనపు అందాన్నిస్తుంది.
హృదయాకారపు ముఖం ఉన్నవారికి గుండ్రనివి, నక్షత్రాకారపు బిందీలు బాగుంటాయి. చుట్టూ మెరిసే రాళ్లు లేదా గుండ్లు లేదా చిన్న పూసలు పేర్చిన బిందీలు పెట్టుకుంటే వీరు ఆకర్షణీయంగా కనిపిస్తారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - May 30 , 2025 | 02:59 PM