ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

stomach pain: కడుపునొప్పి తగ్గాలంటే..!

ABN, Publish Date - Mar 17 , 2025 | 04:33 AM

చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు కడుపు నొప్పి వస్తుంది. గ్యాసు సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇలాంటి సమయాల్లో వెంటనే మందులు వేసుకోకుండా- చిన్న చిన్న చిట్కాలు పాటించమని ఆయిర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అల్లం రసం

జీర్ణ సమస్యలకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో జింజరోల్‌, షోగోల్‌ వంటి కాంపౌండ్స్‌ జీర్ణకోశంలో వచ్చే వాపులను, నొప్పిని తగ్గిస్తాయి. అల్లం... పిత్తం సక్రమంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల అజీర్ణ సమస్య తగ్గుతుంది. కడుపు నొప్పి వచ్చినప్పుడు కొద్దిగా అల్లం రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే సత్వర ఉపశమనం కలుగుతుంది.

పిప్పర్‌మెంట్‌

పిప్పర్‌మెంట్‌లో మెంథాల్‌ ఉంటుంది. ఇది జీర్ణకోశంలోని వాపును తగ్గిస్తుంది. పేరుకుపోయిన గ్యాసును తొలగిస్తుంది. పేగుల్లో నొప్పిని కూడా తగ్గిస్తుంది. కడుపునొప్పి వచ్చిన వారు - కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ కలిపిన వేడినీళ్లను తాగటం వల్ల నొప్పి తగ్గుతుంది.

జీలకర్ర

జీలకర్రలో ఎనిట్‌హోల్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణకోశంపై పనిచేసి వాపును తగ్గిస్తుంది. అజీర్తి సమస్య ఉన్నవారు క్రమతప్పకుండా జీలకర్ర నీళ్లను తాగటం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.

పసుపు

పసుపులో కుర్‌క్యుమిన్‌ అనే ఒక కాంపౌండ్‌ ఉంటుంది. దీనికి జీర్ణవ్యవస్థలో కలిగే ఇబ్బందులను తొలగిస్తుంది. కడుపులో గ్యాస్‌ పేరుకుపోయినప్పుడు - గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 04:33 AM