ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mosquito Repellent Plants: దోమలను పారద్రోలే మొక్కలు ఇవే..

ABN, Publish Date - Jun 02 , 2025 | 04:52 AM

వానాకాలంలో దోమల నుంచి రక్షణ పొందేందుకు తులసి, నీలగిరి, పుదీనా, నిమ్మగడ్డి వంటి మొక్కలను ఇంటి చుట్టూ పెంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కల వాసన దోమలను దూరంగా ఉంచుతుంది.

వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం కాగానే గుంపులుగా దోమలు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇవి రాత్రిపూట నిద్రపోనివ్వవు. వీటివల్ల పలు రకాల వ్యాధులు కూడా సోకుతాయి. దోమలను నివారించేందుకు ఇంటి చుట్టూ కొన్ని రకాల మొక్కలు పెంచితే సరిపోతుంది అంటున్నారు నిపుణులు.

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్కను ఏర్పాటు చేస్తే దోమలు లోనికి రావు. బాల్కనీలు, కిటికీల గోడల మీద కూడా చిన్న కుండీల్లో తులసి మొక్కను పెంచవచ్చు.

ఇంటి పరిసరాల్లో యూకలిప్టస్‌, నీలగిరి మొక్కలు పెంచితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మొక్కలు విడుదల చేసే ఘాటైన వాసనలకు దోమలు నశించిపోతాయి.

చాలామంది దోమలు వచ్చే సమయానికి ఇంటి తలుపులు మూసేస్తూ ఉంటారు. అయినప్పటికీ బాల్కనీలు, కిటికీల నుంచి దోమలు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆ ప్రదేశాల్లో వెడల్పాటి కుండీలు ఏర్పాటు చేసి పుదీనా, నిమ్మ గడ్డి, రోజ్‌మేరీ, లావెండర్‌, బంతిపూల మొక్కలు పెంచాలి. ఈ మొక్కల ఆకులు, పూల నుంచి వెలువడే సువాసనలు సరిపడక దోమలు దూరంగా పారిపోతాయి. ఈ మొక్కల కుండీలను ఇంట్లో అమర్చుకుంటే దోమలన్నీ బయటికి వెళ్లిపోతాయి.


సిట్రోనెల్లా అనేది ఓ గడ్డి మొక్క. ఇది సుగంథాన్ని వెదజల్లుతుంది. ఈ మొక్కని కిటికీల దగ్గర, ఇంటి చుట్టూ గోడల వెంబడి పెంచితే దోమలు దూరంగా వెళ్లిపోతాయి.

దోమలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో వెల్లుల్లి మొక్కను పెంచితే పది రోజుల్లో దోమలన్నీ నశించిపోతాయి.

గుమ్మానికి ఇరుపక్కలా హార్స్‌మింట్‌, స్నేక్‌ప్లాంట్‌, ఆలియం, సేజ్‌, జెరేనియం మొక్కల కుండీలు పెడితే దోమలు ఇంట్లోకి రావు.

గడ్డి చేమంతి మొక్క కూడా దోమలను పారద్రోలుతుంది. దీని పూలు పసుపు, తెలుపు, ఎరుపు, గులాబీ, ఊదా రంగుల్లో ఉంటాయి. ఇంటి ముందు వేలాడే కుండీలను ఏర్పాటు చేసుకుని వాటిలో ఈ మొక్కను పెంచితే ప్రయోజనం ఉండడమే కాకుండా పరిసరాలు అందంగా కనిపిస్తాయి.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 04:52 AM