Loneliness Tips: ఒంటరితనం వేధిస్తోందా
ABN, Publish Date - Aug 06 , 2025 | 01:02 AM
ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో అనవసరమైన ఆలోచనలు
ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో అనవసరమైన ఆలోచనలు వేధిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కుంగిపోకుండా ఆనందంగా ఎలా గడపాలో తెలుసుకుందాం...
రోజూ కొద్దిసేపు ఇంటి పరిసరాల్లో వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. వ్యాయామం, ధ్యానం లాంటివి కూడా ఉపకరిస్తాయి.
ఆత్మీయులకు ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడడం వల్ల ఒంటరితనం అనే భావన కలుగదు. వీడియో కాల్ అయితే వెంటనే మనసు కుదుపడుతుంది.
ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం వల్ల ఒంటరిగా ఉన్నామనే ఆలోచన రాదు. ఇంటి పని, తోటపని లేదంటే ఆఫీసు పని ఇలా ఆసక్తి ఉన్నదానిమీద మనసు నిలిపితే ప్రయోజనకరంగా ఉంటుంది.
వంట చేయడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం లాంటి వి అలవాటు చేసుకుంటే ఒంటరితనం వేధించదు.
ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలి. ఏకాంతంగా గడపడం వల్ల శక్తిని పుంజుకుని ఉత్సాహంగా ఉండగల్గుతారు.
వీలైనప్పుడల్లా వృద్ధులకు, చిన్న పిల్లలకు అలాగే ఇతరులకు చేతనైన సహాయం చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.
వ్యక్తిగత శ్రద్ధ, సమాజసేవ, ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోవడం, నూతన సాంకేతిక పరిజ్ఞాననంపై అవగాహన పెంచుకోవడం, సమకాలిక
పరిస్థితుల్లో వస్తున్న మార్పులు తెలుసుకోవడం లాంటివి చేస్తూ సమాజంతోపాటు నడుస్తూ ఉంటే ఒంటరితనమనే భావన మాయమవుతుంది.
Updated Date - Aug 06 , 2025 | 01:02 AM