Mental Strength Tips: మానసిక బలాన్ని ఇలా పెంచుకుందాం
ABN, Publish Date - May 12 , 2025 | 05:24 AM
అపజయాలు ఎదురైనప్పుడు మనోబలాన్ని పెంచుకోవడానికి సానుకూల దృక్పథం, భావోద్వేగ నియంత్రణ, ఆత్మవిశ్వాసం అవసరం. స్నేహితులతో ముచ్చట్లు, సంగీతం, ఆటలు మనసుకు ఉపశమనం కలిగిస్తాయి.
అకస్మాత్తుగా అపజయాలు ఎదురైనప్పుడు అనుకున్నది సాధించలేకపోయామన్న భావన వేధిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మానసిక బలాన్ని పెంపొందించుకోవడానికి నిపుణులు చెబుతున్న చిట్కాలివి...
మానసికంగా బలంగా ఉండాలంటే సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అనుకున్నది జరగనప్పుడు కుంగిపోకుండా వైఫల్యానికి కారణాలను తెలుసుకోవాలి.
ఏదైనా కొత్త పనిని తలపెట్టినప్పుడు పాత విధానాన్ని కాకుండా విభిన్న మార్గాన్ని ఎంచుకోవాలి.
పనులను వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు వాటిని పూర్తిచేయడం అలవాటు చేసుకోవాలి.
చుట్టూ ఉన్న పరిస్థితులను అంగీకరించడం నేర్చుకోవాలి. మార్చలేని, నియంత్రించలేని అంశాల గురించి అతిగా ఆలోచించి సమయం వృథా చేసుకోకూడదు.
గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి. దీనివల్ల మళ్లీ ప్రయత్నించాలనే భావన కలుగుతుంది.
తోటివారితో స్నేహంగా మెలగడం అలవాటు చేసుకోవాలి. . భావోద్వేగాలను నియంత్రిచుకోవాలి.
ఇష్టమైన ఆటలు ఆడడం, సంగీతం వినడం, నృత్యం చేయడం, స్నేహితులతో సరదాగా ముచ్చటించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆందోళన తగ్గుతుంది.
Updated Date - May 12 , 2025 | 05:25 AM