Soaked Dry Fruits: ఎండుద్రాక్ష నీళ్లతో ప్రయోజనాలు
ABN, Publish Date - Jun 02 , 2025 | 04:41 AM
నల్ల ఎండుద్రాక్ష నీళ్లు పరగడుపున తాగడం వల్ల రక్తహీనత నివారణ, జీర్ణక్రియ మెరుగుదల, చర్మ ఆరోగ్యం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే చాలామంది ఉదయాన్నే నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష తింటుంటారు. అయితే పరగడుపున నల్ల ఎండుద్రాక్ష నీళ్లను తాగడం వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ఈ నీళ్లలో ఫైబర్ ఉంటుంది. అది అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.
ఈ నీళ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
ఈ నీళ్లలో సహజసిద్ధంగా ఉండే చక్కెర, కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఈ నీటిలో ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత దరిచేరకుండా చేస్తాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం బీపీని నియంత్రిస్తాయి. చెడు కొలె స్ట్రాల్‌ను తగిస్తాయి. దాంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ నీళ్లలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి చర్మ సమస్యలను దూరం చేస్తాయి
10- 15 నల్ల ఎండు ద్రాక్షలను తీసుకుని నీళ్లతో బాగా కడిగాలి. ఇప్పుడు వాటిని ఓ గ్లాసుడు మంచి నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఆ నీటిని తాగేయాలి. నానబెట్టిన ఎండుద్రాక్షలను కూడా తినేయవచ్చు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 02 , 2025 | 04:49 AM