ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Newborn Nutrition: అవి బంగారు ఘడియలు

ABN, Publish Date - May 22 , 2025 | 08:48 AM

బిడ్డ పుట్టిన వెంటనే, ముఖ్యంగా తొలి గంటలో తల్లిపాలను ఇవ్వడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఇచ్చే కొలస్ట్రమ్‌ బిడ్డకు వ్యాధినిరోధక శక్తిని కల్పించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డాక్టర్‌! నాకు తొమ్మిదో నెల. పుట్టబోయే బిడ్డకు పాలు పట్టించే విషయంలో నాకెన్నో అనుమానాలున్నాయి. ప్రసవించిన వెంటనే బిడ్డకు రొమ్ము పాలను పట్టించకూడదనీ, వాటిని పిండేయాలనీ పెద్దలు అంటున్నారు. ఇదెంతవరకూ నిజం?

- ఓ సోదరి, హైదరాబాద్‌

బిడ్డ పుట్టిన తొలి 60 నిమిషాలు బంగారు ఘడియల్లాంటివి. పాలు పట్టించడానికి అవెంతో కీలకమైన ఘడియలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసె్‌ఫలు గుర్తించాయి. ఒక ల్యాక్టేషన్‌ కన్సల్టెంట్‌గా అది ఎలాంటి ప్రసవమైనా, బిడ్డ పుట్టిన అరగంటలోపే పాలు పట్టించడంలో నేను తల్లులకు సహాయపడుతూ ఉంటాను. తల్లిపాలలో ఎంతో విలువైన కొలస్ట్రమ్‌ అనే పదార్థం ఉంటుంది. దీన్ని ద్రవరూప బంగారంగా పేర్కొంటూ ఉంటారు. బిడ్డ వ్యాధినిరోధకశక్తి బలపడడానికి కొలస్ట్రమ్‌ తోడ్పడుతుంది. సిజేరియన్‌ సర్జరీతో బిడ్డను కన్న తల్లులకు ఫుట్‌బాల్‌ హోల్డ్‌ భంగిమలో తల్లిపాలు పట్టించమని నేను సూచిస్తాను. దీంతో బిడ్డకు సౌకర్యంగా పాలు పట్టించే వీలుంటుంది. అలాగే సాధారణ ప్రసవమైన పిల్లలకు పాలు పట్టించడం కోసం, క్రాస్‌ క్రేడిల్‌, హోల్డ్‌ భంగిమలను అనుసరించాలి. అలాగే పిల్లలు పాలు తాగిన తర్వాత తప్పనిసరిగా త్రేన్పు వచ్చేలా చూసుకోవాలి.


తొలి గంట పాలల్లో...

వ్యాధినిరోధకశక్తి: తొలి పాలల్లోని కొలస్ట్రమ్‌లో యాంటీబాడీలు, వ్యాధినిరోధక కణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల నుంచి బిడ్డకు సత్వర రక్షణ కల్పిస్తాయి. అలాగే బిడ్డ వ్యాధినిరోధకశక్తి బలపడడానికి తోడ్పడతాయి

  • అనుబంధం: రొమ్ముపాలతో తల్లికీ, బిడ్డకూ మధ్య అనుబంధం బలపడుతుంది. పాలివ్వడం ద్వారా తల్లి శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ గర్భాశయం కుంచించుకుపోవడానికీ, రక్తస్రావం తగ్గడానికీ తోడ్పడుతుంది

  • సౌకర్యం: తొలి గంటలో పాలు తాగిన పిల్లలు, తర్వాతి కాలంలో పాలు తాగడంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉండదు. అలాగే తల్లుల్లో పాల ఉత్పత్తి ప్రేరేపితమవుతుంది

  • బిడ్డ ఆరోగ్యం: తల్లి పాలు, బిడ్డ రక్తంలోని చక్కెర, శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగాలను స్థిరపరుస్తాయి

  • పేగుల ఆరోగ్యం: కొలస్ట్రమ్‌ సహజసిద్ధమైన విరోచనకారి. బిడ్డ తొలి విసర్జకాన్ని సులభంగా విసర్జించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే దీంతో కామెర్ల ముప్పు తప్పుతుంది. బిడ్డ పేగుల్లో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది.

డాక్టర్‌ కుడిపూడి ఊహ, ల్యాక్టేషన్‌ కన్సల్టెంట్‌,

మెడికవర్‌ విమెన్‌ అండ్‌ ఛైల్డ్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

Updated Date - May 22 , 2025 | 08:52 AM