ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Jewelry Cleaning: బంగారు ఆభరణాల మెరుపులకు.

ABN, Publish Date - Apr 07 , 2025 | 03:40 AM

మహిళలు సాధారణంగా గొలుసులు, గాజులు, దిద్దులు, ఉంగరాలు లాంటి బంగారు ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. వీటి మీద చెమట, దుమ్ము చేరడం వల్ల అవి మెరుపును కోల్పోయి నల్లబడుతుంటాయి. ఈ ఆభరణాలను కొత్తవాటిలా మెరిపించడానికి ఇంట్లోనే శుభ్రం చేసే విధానాలను చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని చిట్కాలు

మీ కోసం...

ఒక గిన్నెలో ఒక గ్లాసు వేడి నీళ్లు పోసి, రెండు చెంచాల బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. ఇందులో నల్లగా మారిన బంగారు ఆభరణాలను ఉంచి అరగంట సేపు నానబెట్టాలి. తరవాత మెత్తని స్పాంజితో రుద్ది మంచినీళ్లతో కడిగితే నగలు కొత్తవాటిలా మెరుస్తాయి.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి ఒక చెంచా పసుపు, ఒక చెంచా సర్ఫ్‌ వేసి అయిదు నిమిషాలు వేడి చేసి దించాలి. ఇందులో బంగారు ఆభరణాలు ఉంచి పది నిమిషాలు నాననివ్వాలి. తరవాత వాటిని పాత టూత్‌బ్రష్‌తో సున్నితంగా రుద్ది నీళ్లతో కడిగితే మురికి పూర్తిగా వదిలిపోతుంది.

ఒక గిన్నెలో రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు పోసి అందులో కొద్దిగా డిటర్జెంట్‌ పౌడర్‌ లేదా వాషింగ్‌ లిక్విడ్‌ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో నగలు ఉంచి పావుగంటసేపు నానబెట్టాలి. తరవాత వేళ్లతో రుద్దుతూ నీళ్లతో శుభ్రం చేస్తే వాటిమీద పేరుకున్న మురికి తొలగిపోతుంది.


ఒక పాత టూత్‌బ్రష్‌ మీద కొద్దిగా టూత్‌పేస్టు వేసి దానితో ఆభరణాలను మెల్లగా తోమాలి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. తరవాత ఈ ఆభరణాలను మంచినీళ్లలో ముంచి తీసి పొడిగుడ్డతో తుడిస్తే కొత్తవాటిలా కనిపిస్తాయి.

వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన ఆభరణాలను సబ్బునీటితో శుభ్రం చేయవచ్చు. ముత్యాలు పొదిగిన నగలను మాత్రం తేలికపాటి షాంపూ కలిపిన నీళ్లతో కడగాలి.

అలాగే వెండి వస్తువులు, ఆభరణాలు కూడా ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు. షాపునకు వెళ్లినప్పుడు మొదటగా వారు కుంకుడుకాయ నురగతో శుభ్రం చేస్తారు. ఇలా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. వెండి వస్తువులను ఓ అరగంటపాటు కుంకుడు కాయల రసంలో వేసి ఉంచండి. తరువాత కుంకుడు కాయ నురగ తీసుకొని వెండి వస్తువులపై రుద్దితే కొత్తవిలా మెరుస్తాయి.


ఇవి కూడా చదవండి:

'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం

జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి

Read Latest and International News

Updated Date - Apr 07 , 2025 | 03:40 AM