ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Facial Black Spots: ఆ మచ్చలు ప్రమాదకరమా

ABN, Publish Date - May 12 , 2025 | 05:11 AM

చర్మంపై ఏర్పడే నల్లటి మచ్చలు అన్ని ప్రమాదకరమైనవే కావు. అయితే అవి పెరుగుతుంటే లేదా రసి కారితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

కెన్సెలింగ్

నాకు 35 ఏళ్లు.. ఈ మధ్యకాలంలో నా చర్మంపై నల్లటి మచ్చలు వస్తున్నాయి. క్యాన్సర్‌ అనే అనుమానంతో భయమేస్తోంది. ఈ మచ్చలు పోయేందుకు పరిష్కారమేదైనా ఉందా?

కొందరికి వయస్సుతో పాటుగా చర్మంపై నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి. అయితే అన్ని మచ్చలు క్యాన్సర్‌ను సూచించవు. మన చర్మంలో మెలెనిన్‌ అనే పదార్థం ఎక్కువ ఉత్పత్తి అయితే ఈ మచ్చలు ఏర్పడతాయి. ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉన్నా.. హార్మోన్‌ సమస్యలు ఏర్పడినా ఈ మచ్చలు వచ్చే అవకాశం ఉంది. హార్మన్‌ సమస్యల వచ్చే మచ్చలు సాధారణంగా బుగ్గల మీద.. ముక్కు మీద.. నుదుటి మీద ఏర్పడతాయి. కొన్ని సార్లు ఎగ్జిమా వంటి చర్మ వ్యాధుల వల్ల కూడా మచ్చలు వచ్చే అవకాశముంది. ఈ మధ్య కాలంలో లేజర్‌ చికిత్సల ద్వారా ఈ మచ్చలను తొలగించటానికి వీలవుతోంది. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి. ఈ మచ్చల పరిమాణం పెరగకపోతే పర్వాలేదు. కానీ అవి పెరుగుతూ ఉన్నా.. దురద పెడుతున్నా.. వాటి నుంచి రసి కారుతున్నా వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. లేకపోతే అవి ప్రమాదకరంగా మారే అవకాశముంది.

Updated Date - May 12 , 2025 | 05:14 AM