ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tomatoes: టమాటాల నిల్వ ఇలా!

ABN, Publish Date - Mar 17 , 2025 | 04:38 AM

టమాటల ధర మార్కెట్లో ఒక్కొక్కసారి ఒకోలా ఉంటుంది. చవకగా దొరికినప్పుడు వాటిని సరైన పద్ధతుల్ల్లో నిల్వ చేసుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఆ పద్ధతులేమిటో చూద్దాం..

టమాటాలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా తుడవాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి.. వాటిని ఒక మూకుడులో వేసి ఉడికించాలి. ఇలా ఉడికిన మిశ్రమాన్ని మిక్సిలో వేసి మెత్తగా రుబ్బాలి. దీనిలో తగినంత ఉప్పు, చక్కెర, వెనిగర్‌ వేసి కలపాలి. ఈ సాస్‌ను గాజు సీసాలో పోసి రిఫ్రిజరేటర్‌లో పెడితే చాలా కాలం నిల్వ ఉంటుంది.

లేత పసుపు రంగులో ఉన్న టమాటాలను సన్నని చక్రాలుగా కోసి ఎండలో పెట్టాలి. టమాటా ముక్కల్లో నీరంతా పోయి బాగా ఎండేలా చూసుకోవాలి. తరవాత వీటిని గాలి చొరబడని డబ్బాలో పోసి ఉంచుకుంటే నాలుగు నెలల వరకూ నిల్వ ఉంటాయి.

టమాటాలను బాగా ఉడికించి తొక్కలు తీసేయాలి. వీటిని మిక్సీలో వేసి బాగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ట్రేలలో వేసి ఫ్రిజర్‌లో పెట్టాలి. ఇవి బాగా గట్టి పడిన తర్వాత జిప్‌లాక్‌ బ్యాగుల్లోకి మార్చుకోవాలి. ఇవి చాలా కాలం నిల్వ ఉంటాయి.


పచ్చి టమాటాలను నీటిలో కడిగి, తడి లేకుండా పల్చని గుడ్డతో తుడిచి.. జిప్‌లాక్‌ బ్యాగుల్లో వేసి ఫ్రీజర్‌లో పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటాయి.

టమాటాలను చిన్న ముక్కలుగా కోసి ఒక గాజు సీసాలో వేయాలి. ముక్కలు మునిగేవరకు ఆలివ్‌ ఆయిల్‌ పోయాలి. ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, వెనిగర్‌ వేసి కలపాలి. వెనిగర్‌ వల్ల టమాటా ముక్కలు తాజాగా ఉంటాయి. ఈ ముక్కలను పాస్తా, వెజిటబుల్‌ సలాడ్‌, శాండ్‌విచ్‌ల తయారీలో వాడుకోవచ్చు.

దోరగా పసుపు రంగులో ఉండే టమాటాలను తెచ్చుకుని శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడవాలి. వీటిని సన్నని పొడవైన ముక్కలుగా కోయాలి. వీటిని బాగా ఎండబెట్టాలి. బాగా ఎండిన టమాటా ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్‌ చేయాలి. ఈ టమాటా పొడిని గాజు సీసాలో పోసి మూత పెట్టి రిఫ్రిజరేటర్‌లో పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 17 , 2025 | 04:38 AM