ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: ట్రైనీ డాక్టర్ అభయ హత్యాచారం కేసు.. నేడు రెండు కోర్టుల్లో విచారణ..

ABN, Publish Date - Jan 22 , 2025 | 11:59 AM

ఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కళాశాల (RG Kar Medical College) ట్రైనీ డాక్టర్ "అభయ"(Abhaya) హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు(Supreme), కోల్‌కతా హైకోర్టు ఇవాళ (బుధవారం) విచారణ చేపట్టనున్నాయి. జనవరి 20న ట్రైనీ డాక్టర్ హత్య కేసు విచారణ సందర్భంగా సంజయ్ రాయ్‌(Sanjay Roy)ను ట్రయల్ కోర్టు (Trial Court) దోషిగా తేల్చింది.

Supreme Court

ఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కళాశాల (RG Kar Medical College) ట్రైనీ డాక్టర్ "అభయ"(Abhaya) హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు (Supreme), కోల్‌కతా హైకోర్టు ఇవాళ (బుధవారం) విచారణ చేపట్టనున్నాయి. జనవరి 20న ట్రైనీ డాక్టర్ హత్య కేసు విచారణ సందర్భంగా సంజయ్ రాయ్‌(Sanjay Roy)ను ట్రయల్ కోర్టు (Trial Court) దోషిగా తేల్చింది. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ.17లక్షల పరిహారం ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ట్రయల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

Road Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం. లారీ బోల్తాపడి ఏకంగా..


ఈ నేపథ్యంలోనే తీర్పు వెలువడిన 24 గంటలు గడవకముందే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కిషోర్‌ దత్తా మంగళవారం ఉదయమే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే సీబీఐ దర్యాప్తు సరిగా జరగలేదని, సమగ్ర దర్యాప్తు చేయాలని అభయ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. అలాగే సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ దేబాంగ్షు బసక్, జస్టిస్ షబ్బర్ రషీదిలతో కూడిన ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

రూ.500 నోటుతో జర జాగ్రత్త

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

Updated Date - Jan 22 , 2025 | 12:02 PM