Shreya Ghoshal: తమిళ అభిమానులంటే నాకు ఎంతో ఇష్టం..
ABN, Publish Date - Feb 21 , 2025 | 07:10 AM
తమిళ అభిమానులన్నా, చెన్నై నగరమన్నా తనకెంతో ఇష్టమని, తమిళ ప్రజలు తనపై ప్రదర్శిస్తున్న ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువలేనని ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్(Singer Shreya Ghoshal) అన్నారు.
- గాయని శ్రేయా ఘోషల్
చెన్నై: తమిళ అభిమానులన్నా, చెన్నై నగరమన్నా తనకెంతో ఇష్టమని, తమిళ ప్రజలు తనపై ప్రదర్శిస్తున్న ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువలేనని ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్(Singer Shreya Ghoshal) అన్నారు. ‘ఆల్‌హార్ట్స్’ పర్యటనలో భాగంగా ఆమె గురువారం సాయంత్రం చెన్నై నగరానికి విచ్చేశారు. ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: అవును.. వారిద్దరి మధ్య మళ్లీ మొదలైందిగా.. విషయం ఏంటంటే..
మార్చి ఒకటిన చెన్నై(Chennai)లోని నందనం వైఎంసీఏ మైదానంలో జరుగనున్న తన సంగీత విభావరి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. తమిళ చలనచిత్రాల్లో తాను పాడిన పాటలు శ్రోతల మదిలో పదిలంగా ఉంటాయని చెబుతూ ఓ తమిళ పాట గానం చేసి అందరినీ మైమరపించారు. మార్చి 1న ‘హాల్‌హార్ట్స్’ సంగీత విభావరికి సంబంధించి టికెట్ల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయని ఆమె చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News
Updated Date - Feb 21 , 2025 | 07:10 AM