ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sanjay Raut: కాంగ్రెస్‌లోకి సంజయ్ రౌత్..?

ABN, Publish Date - Feb 02 , 2025 | 05:43 PM

సంజయ్ రౌత్ రాజ్యసభ సభ్యత్వం ముగియవచ్చిందని, మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు థాకరే సారథ్యంలోని శివసేనకు తగినంత బలం లేదని రాణే తెలిపారు. 288 మంది సభ్యుల అసెంబ్లీలో శివసేన (యూబీటీ)కి కేవలం 20 మంది సభ్యులే ఉన్నట్టు చెప్పారు.

ముంబై: శివసేన (UBT) సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) పార్టీని వీడనున్నారా? కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారా? మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీష్ రాణే 'అవుననే' చెబుతున్నారు. కాంగ్రెస్‌లోకి చేరేందుకు ఢిల్లీలోని ఒక నేతతో సంజయ్ రౌత్ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆదివారంనాడు తెలిపారు.

Ayodhya: రాజీనామా చేస్తా.. అయోధ్య ఎంపీ సంచలన ప్రకటన


సంజయ్ రౌత్ రాజ్యసభ సభ్యత్వం ముగియవచ్చిందని, మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు థాకరే సారథ్యంలోని శివసేనకు తగినంత బలం లేదని రాణే తెలిపారు. 288 మంది సభ్యుల అసెంబ్లీలో శివసేన (యూబీటీ)కి కేవలం 20 మంది సభ్యులే ఉన్నట్టు చెప్పారు. దీంతో కాంగ్రెస్‌లో చేరేందుకు సంజయ్ రౌత్ సిద్ధపడుతున్నారని, ఢిల్లీలోని ఓ కాంగ్రెస్ నేతతో మంతనాలు సాగిస్తు్న్నారని తెలిపారు.


''శివసేనలో రౌత్ ఎంతకాలం ఉండనున్నారనే విషయాన్ని పార్టీ పత్రిక సామ్నాలో రౌత్ చెప్పాలి. కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన ఢిల్లీలో మంతనాలు సాగిస్తున్న నేత ఎవరో చెప్పాలి. దీనిపై ఆయన ఒక ప్రకటన చేయాలి"అని రాణే అన్నారు. కాగా, రాణే వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ స్పందించాల్సి ఉంది.


ఇదీ నేపథ్యం

నితీష్ రాణా వ్యాఖ్యల వెనుక సంజయ్ రౌత్ 'సామ్నా'లో రాసిన సంపాదకీయమే కారణం కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవిస్‌కూ ఆయన డిప్యూటీ అయిన శివసేన నేత ఏక్‌నాథ్ షిండేకు మధ్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయని, ఇది రాష్ట్ర ప్రగతిపై ప్రభావం చూపుతోందని సంజయ్ రౌత్ ఇటీవల సామ్నా సంపాదకీయంలో రాశారు.


ఇవి కూడా చదవండి..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 05:43 PM