PM Modi: భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు.. మోదీ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 21 , 2025 | 09:45 PM
భారతీయ భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానినొకటి సుసంపన్నం చేసిందని అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారంనాడు జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనలో ప్రధాని మాట్లాడుతూ, భారత భాషల మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం (NEP) కింద హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందంటూ తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ భాషల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, ప్రతి భాష ఒకదానినొకటి సుసంపన్నం చేసిందని అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారంనాడు జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనలో ప్రధాని మాట్లాడుతూ, భారత భాషల మధ్య ఎప్పుడూ శత్రుత్వం లేదని స్పష్టం చేశారు.
PM Modi: పవార్‌కు కుర్చీ చూపించి నీళ్లు అందించిన మోదీ
"భారతీయ భాషలన్నీ ఒకదానికొకటి సుసంపన్న చేసుకున్నాయి. భాషా ప్రాతిపదికగ విభజనలు తెచ్చే ప్రయత్నాలు జరిగినా భారతదేశ ఉమ్మడి భాషా వారసత్వం తగిన సమాధానం ఇచ్చింది. ఇలాంటి అపోహలకు దూరంగా ఉంటూ అన్ని భాషాల సమున్నతికి పాటుపడటం ఒక సామాజిక బాధ్యతగా మనమంతా గుర్తించాలి. ఆ దిశగానే ఈరోజు మరాఠీ భాషతో సహా దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ విద్యను ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది'' అని ప్రధాని అన్నారు.
మహారాష్ట్ర యవత మరాఠీలోనే హైయర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడికల్ స్టడీస్ చేస్తు్న్నారని చెప్పారు. లిటరేచర్ అనేది సమాజానికి అద్దంలాంటిదని, సమాజానికి ఒక నిర్దేశకత్వం చూపుతుందని వివరించారు. రిటరరీ సదస్సులు, సంస్థలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద భాషా వైవిధ్యం కలిగి ఉందని, భాషా వైవిధ్యం మన ఐక్యతకు ప్రాథమిక ఆధారమని మోదీ అన్నారు. జాతీయ విద్యావిధానంతో త్రిభాషా సూత్రాన్ని విధించే ప్రయత్నంలో తమపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తు్న్నారంటూ తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Ranveer Allahbadia Controversy: రాఖీ సావంత్‌కు మహారాష్ట్ర పోలీసులు సమన్లు
MEA: జమ్మూకశ్మీర్‌పై ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితం.. భారత్ తీవ్ర అభ్యంతరం
DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
Birthday: వారం ముందే సీఎం స్టాలిన్ జన్మదిన వేడుకలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 21 , 2025 | 09:45 PM