PM Modi: నన్ను క్షమించండి.. ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్..
ABN, Publish Date - Feb 27 , 2025 | 12:23 PM
యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుంభమేళా శివరాత్రితో ముగిసింది. ఈ 45 రోజుల వేడుకలో 66 కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. ఈ సందర్భంగా..
PM Modi Tweet on Mahakumbha Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. 'ఐక్యత కోసం మహా యజ్ఞం పూర్తయిందని' ఆయన పేర్కొన్నారు. భక్తులు తమ తీర్థయాత్రలో ఎదుర్కొన్న అసౌకర్యాలకు ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. కుంభమేళా విశేషాలను తన బ్లాగ్‌లో రాసిన ప్రధాని..ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదని వివరించారు.
మహాకుంభమేళాను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మా పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఐక్యతా మహాకుంభమేళాలో మొత్తం 45 రోజుల పాటు జరిగిన ఈ ఒక్క పండుగ కోసం 140 కోట్ల మంది దేశప్రజలు విశ్వాసంతో ఏకతాటిపైకి వచ్చిన తీరు అపారమైనదని ట్వీట్‌లో తెలిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ లేజర్ లైట్ షోతో ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి.
66.21 కోట్లకు పైగా భక్తులు
ప్రపంచంలోనే అతిపెద్ద జనసమూహమైన మహా కుంభమేళా, మహా శివరాత్రి నాడు ప్రయాగ్‌రాజ్‌లో ముగిసింది. చివరి రోజున, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. పండుగ సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద 66.21 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానంలో పాల్గొన్నారని తెలిపారు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో దేశ రాజకీయ నాయకులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో సహా ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు పవిత్ర త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు.
Also Read:
షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ నూస్.. అద్దె ఇంటికి వెళ్తున్న స్టార్ హీరో..
రాత్రిపూట రీల్స్ చూస్తున్నారా.. ఇక ఆసుపత్రి పాలే..
Updated Date - Feb 27 , 2025 | 02:32 PM