High Court: 3 నెలల్లో పార్టీల జెండాలు తొలగించాల్సిందే
ABN, Publish Date - Jan 28 , 2025 | 01:52 PM
రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగర, పట్టణ పంచాయతీలు, జిల్లా పంచాయతీ యూనియన్‌కు చెందిన రహదారుల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల జెండాలు, మతసంస్థల పతకాలు, ఉద్యమసంస్థలు, కార్మిక సంస్థల జెండాలన్నీ మూడు నెలల్లోగా తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం(Madurai Bench of the High Court) ఆదేశించింది.
- హైకోర్టు మదురై బెంచ్ ఆదేశం
చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగర, పట్టణ పంచాయతీలు, జిల్లా పంచాయతీ యూనియన్‌కు చెందిన రహదారుల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల జెండాలు, మతసంస్థల పతకాలు, ఉద్యమసంస్థలు, కార్మిక సంస్థల జెండాలన్నీ మూడు నెలల్లోగా తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం(Madurai Bench of the High Court) ఆదేశించింది. గడువులోగా జెండాలు, పతాకాలను పెట్టిన పార్టీలు, మతసంస్థలు వాటిని తొలగించకపోతే.. రాష్ట్రప్రభుత్వం పోలీసుల ద్వారా వాటిని తొలగించి, దానికయ్యే ఖర్చు ఆయా పార్టీలు, మత సంస్థల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది.
ఈ వార్తను కూడా చదవండి: Governor: గవర్నర్ సంచలన కామెంట్స్.. దళితుడే సీఎం కావాలి
రహదారులను ఆక్రమించుకుని ఈ జెండాలను పాతడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. మదురై విలాంగుడి ప్రాంతానికి చెందిన సిద్దన్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్‌లో ఓ పిటిషన్ వేశారు. అన్నాడీఎంకేలో ఉన్న తాను పార్టీ 53వ వార్షికోత్సవం సందర్భంగా మదురై కూడల్‌పుదూరు ప్రాంతంలో పాత జెండాను తొలగించి కొత్త జెండా ఏర్పాటు చేయాలని నిర్ణయించానని, ఆ మేరకు కొత్త జెండా ఏర్పాటుకు అనుమతించేలా కార్పొరేషన్‌కు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇదే విధంగా మదురై బైపాస్ రోడ్డు బస్టాపు వద్ద అన్నాడీఎంకే జెండాను నాటేందుకు అనుమతించాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా శాఖ నేత కదిరవన్ పిటిషన్ వేశారు.
ఈ రెండు పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి ఇలందిరయన్ తీర్పు తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు. సోమవారం ఉదయం ఆ రెండు పిటిషన్లపై ఆయన తీర్పు వెలువరించారు. బహిరంగ ప్రదేశాలలో రాజకీయ పార్టీల జెండాలు, మతసంస్థల పతాకాలు, కుల సంఘాల జెండాలు పెట్టడం వల్ల శాంతి భధ్రతల సమస్యలు ఏర్పడుతున్నాయని, ఏ పార్టీ జెండా తొలగించినా ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహంతో ప్రత్యర్థి పార్టీలకు చెందినవారిపై దాడులకు దిగటం ఆనవాయితీగా మారిందన్నారు. బహిరంగ ప్రదేశాలలో, రోడ్డు మార్జిన్ ఆక్రమించుకుని జెండా స్తంభం పెట్టడం వల్ల ప్రజలకు హాని జరుగుతుందనే విషయాన్ని ఎవరూ మరువకూడదన్నారు. ఇటీవల జెండాల ఎత్తుపై రాజకీయ పార్టీల మధ్య పోటీ కూడా అధికమైందని,
ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని బహిరంగ ప్రదేశాల్లో, జాతీయ, రాష్ట్రీయ రహదారులను ఆక్రమించి పెట్టిన జెండాలను, మత, ఉద్యమ సంస్థలు, కార్మిక సంఘాలు పెట్టిన జెండాలను మూడు నెలల్లోగా తొలగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జెండాలను తొలగించడంతోనే సరిపెట్టుకోకూడదని, రాజకీయ పార్టీలు చేసే వేడుకలు, మత సంస్థల ఉత్సవాలు, కార్మిక సంఘాల వేడుకల రోజుల్లో మాత్రమే జెండాలను పోలీసుల అనుమతి తీసుకుని పెట్టాలని, వేడుకలు పూర్తయిన వెంటనే వాటిని తొలగించాలని తీర్పులో పేర్కొన్నారు. తాము ఇచ్చిన తీర్పులోని అంశాలన్నీ సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించి, తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ జెండాలను పెట్టేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్‌లను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..
ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ
ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Read Latest Telangana News and National News
Updated Date - Jan 28 , 2025 | 01:52 PM