ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Milk: పాల ధర పెరిగే అవకాశం.. లీటర్‌కు రూ.5 వరకు..

ABN, Publish Date - Feb 20 , 2025 | 02:08 PM

రాష్ట్రంలో నందిని బ్రాండ్‌ పాల(Nandini brand milk) ధర పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌ సమర్పించిన వెంటనే కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) కూడా పాల ధర పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

- పాల సమాఖ్యల నుంచి డిమాండ్‌

బెంగళూరు: రాష్ట్రంలో నందిని బ్రాండ్‌ పాల(Nandini brand milk) ధర పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌ సమర్పించిన వెంటనే కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) కూడా పాల ధర పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం లీటరుకు రూ.5 వరకు పెరిగే అవకాశం ఉందని సమాఖ్య వర్గాల ద్వారా తెలుస్తోంది. మార్చి 7న ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) బడ్జెట్‌ సమర్పించనున్నారు. ఆ వెంటనే పాలధర లీటరుకు రూ.5 పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: 25 రోజుల్లో.. 148 కిలోల గంజాయి స్వాధీనం


ఇప్పటికే బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్సు చార్జీలు, నమ్మ మెట్రో చార్జీలు పెరిగిన విషయం విదితమే. తాజాగా రాష్ట్రంలోని వివిధ పాల సమాఖ్యలనుంచి ఒత్తిడి పెరగడంతో పాలధరను కనీసంగా లీటరుకు రూ.5 పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరిలో రాష్ట్రంలోని 16 పాల సమాఖ్యల అధ్యక్షులు, డైరెక్టర్‌లు, ఎండీలు, కేఎంఎఫ్‌ ప్రతినిధులతో పశుసంవర్ధకశాఖ మంత్రి కే వెంకటేశ్‌(Minister K Venkatesh) సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా పశుదాణా, కూలీ, విద్యుత్‌ ఇతర వాటిపై ఖర్చులను ప్రస్తావిస్తూ పాలధర పెంచాలని పలువురు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ 2025 అనంతరం ఈ అంశాన్ని పరిశీలించి పెంచుతామని మంత్రి భరోసా ఇచ్చారు. 2023 ఆగస్టులో పాలధరను రూ.3 పెంచగా లీటరు పాలు (బ్లూ ప్యాకెట్‌) 42గా ఉండేది. 2024 జూన్‌లో మరో రూ.2 పెంచడంతో రూ.44కు చేరింది. తాజాగా పాలధర పెంపు అంశం తెరపైకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.


ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్‌ టీ స్టాల్‌’ వివాదం

ఈవార్తను కూడా చదవండి: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి

ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్‌ పాల్గొనాలి..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 20 , 2025 | 02:08 PM