Tirupati: 25 రోజుల్లో.. 148 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Feb 20 , 2025 | 01:51 PM
గంజాయి రవాణాదారులు.. ఆకతాయిలు, రౌడీషీటర్లు.. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు వారిపై చర్యలు తీసుకుంటూ, కేసులు పెడుతున్నారు.
- 225 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
- బహిరంగంగా మద్యంతాగే వారిపై 2378 కేసులు
తిరుపతి: గంజాయి రవాణాదారులు.. ఆకతాయిలు, రౌడీషీటర్లు.. ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగేవారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు వారిపై చర్యలు తీసుకుంటూ, కేసులు పెడుతున్నారు. ఇలా గత 25 రోజుల వ్యవధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసి 148 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 225 మంది రౌడీషీటర్లను ఆయా పోలీసు స్టేషనకుఉ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: Actor Sharathkumar: తమిళనాడులో త్రిభాషా విధానం అవసరమే ..
మళ్లీ గలాటాలు, ఘర్షణలకు పాల్పడితే కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్పీ హర్షవర్ధనరాజు హెచ్చరించారు. ఇక తిరుపతిలో పాటు చంద్రగిరి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరు(Chandragiri, Satyavedu, Srikalahasti, Naidupeta, Gudur), పాకాల.. ఇలా పలుచోట్ల శివార్లలో బహిరంగంగా మద్యంతాగే ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. అక్కడ పొదలు, చెట్లు ఉంటే శుభ్రం చేశారు. ఇలాంటి చోట్ల మద్యం తాగితే చర్యలు చేపడతామని హెచ్చరించారు. కాగా, పదే పదే బహిరంగంగా మద్యంతాగుతూ పట్టుబడిన 2378 మందిపై కేసులు నమోదు చేశారు.

372 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న 1597 మంది చిరు వ్యాపారులపై న్యూసెన్సు యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది 1686 సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడి చట్టాలపై అవగాహన కల్పించారన్నారు. చట్టాలను అతిక్రమించి ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News