Actor Sharathkumar: తమిళనాడులో త్రిభాషా విధానం అవసరమే ..
ABN , Publish Date - Feb 20 , 2025 | 01:34 PM
వివిధ కులాలు, మతాలు, భాషలు మాట్లాడే ప్రజలు అధికంగా నివసిస్తున్న తమిళనాడులో త్రిభాషా విధానం అవసరమేనని సీనియర్ నటుడు శరత్‌కుమార్(Senior actor Sarathkumar) అభిప్రాయపడ్డారు.
- సీనియర్ నటుడు శరత్‌కుమార్
చెన్నై: వివిధ కులాలు, మతాలు, భాషలు మాట్లాడే ప్రజలు అధికంగా నివసిస్తున్న తమిళనాడులో త్రిభాషా విధానం అవసరమేనని సీనియర్ నటుడు శరత్‌కుమార్(Senior actor Sharathkumar) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానంలో ఎక్కడా హిందీ తప్పనిసరి చేయలేదని, వారివారి మాతృభాషకు ప్రాథాన్యత కల్పిస్తూ, ఆయా రాష్ట్రాల్లో ప్రధానమైన భాషను అవసరమైతే విద్యార్ధులు చదువుకోవచ్చని స్పష్టంగా ఉందని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Railway reservation: వేసవి సెలవులు.. రైల్వే రిజర్వేషన్ ప్రారంభం

ధనికవర్గాల పిల్లలు మాత్రమే అన్ని భాషల్లో చదువుకుంటున్నారని, అయితే ఒక తమిళనాడులో మాత్రమే అన్ని పాఠశాలల్లో ద్విభాషా విధానం ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. మాతృభాషతో పాటు ఇతర భాషల్లో కూడా చదువుకున్నప్పుడే విద్యార్ధులు ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఉన్నత పదవులు అలంకరించి తమ ప్రతిభ చాటుతున్నారని శరత్‌కుమార్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’ వివాదం
ఈవార్తను కూడా చదవండి: రోస్టర్ విధానంలో లోపాలు సరిచేయండి
ఈవార్తను కూడా చదవండి: ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
ఈవార్తను కూడా చదవండి: కులగణన రీ సర్వేలో కేటీఆర్ పాల్గొనాలి..
Read Latest Telangana News and National News