ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mamata Banerjee : మహాకుంభ్‌ కాదు.. మృత్యుకుంభ్‌!

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:53 AM

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌.. ‘మృత్యుకుంభ్‌’గా మారుతోందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమత వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ యోగి సర్కార్‌పై తీవ్రస్థాయిలో

ఏర్పాట్లలో యూపీ ప్రభుత్వం విఫలం బెంగాల్‌ సీఎం మమత ధ్వజం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్‌.. ‘మృత్యుకుంభ్‌’గా మారుతోందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమత వ్యాఖ్యానించారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ యోగి సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో చాలా మంది చనిపోయారని, యూపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎంత పరిహారం ఇచ్చిందని ప్రశ్నించారు. తొక్కిసలాటలో చనిపోయిన తమ రాష్ట్రానికి చెందిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం కూడా చేయలేదని, తమ ప్రభుత్వం పోస్టుమార్టం చేసిందన్నారు. మరణాలకు సరైన కారణం తెలియకుంటే.. ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. మహాకుంభ్‌లో భక్తులకు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదని, చేసిన ఏర్పాట్లలోనూ అసమానతలు ఉన్నాయని, అఽధికారులకు సరైన ప్రణాళికలు లేవని విమర్శించారు. ‘ఇది మృత్యుకుంభ్‌..! నేను మహాకుంభ్‌ను, గంగా మాతను గౌరవిస్తాను. అయితే ఈ కార్యక్రమానికి సరైన ప్లానింగ్‌ లేదు’ అని మమత అన్నారు. డబ్బున్న వాళ్లు, వీఐపీలకు రూ.లక్షతో క్యాంపులను(టెంట్లు) అందుబాటులో ఉంచారని, అయితే పేదల కోసం ఎలాంటి ఏర్పాట్లు లేవని పేర్కొన్నారు. సీఎం మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు హిందువులు, మహాకుంభమేళాపై దాడిగా అభివర్ణించారు. హిందూ సమాజం, సాధువులు నిరసన తెలపాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..


Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా విరాట్ కోహ్లీ ముందు 5 రికార్డులు.. బ్రేక్ చేస్తాడా..

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..


New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 19 , 2025 | 04:53 AM