ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Mahila Samriddhi Yojana: మహిళలకు రూ.2,500 సాయం.. 8 నుంచి రిజస్ట్రేషన్

ABN, Publish Date - Mar 02 , 2025 | 08:57 PM

మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈనెల 8న ప్రారంభిస్తు్న్నట్టు పార్టీ ఎంపీ మనోజ్ తివారి ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కీలక హామీగా నిలిచిన 'ఢిల్లీ మహిళా సమృద్ధి యోజన' పథకం అమలుకు ఢిల్లీ బీజేపీ సర్కార్ సిద్ధమైంది. ఈ పథకం కింద మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఈనెల 8న ప్రారంభిస్తున్నట్టు పార్టీ ఎంపీ మనోజ్ తివారి (Manoj Tiwari) ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఢిల్లీలో అధికారంలోకి రాగానే పేద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది.

Prahlad Patel: ప్రజలకు 'అడుక్కోవడం' అలవాటయింది.. కేంద్ర మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


''మార్చి 8వ తేదీ నుంచి వర్గీకరణ పని మొదలవుతుంది. కేటగిరిలుగా విభజించకపోతే ఎవరికి మేము డబ్బులు ఇవ్వగలం? ఈనెల 8 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెడతాం. మొత్తం పని పూర్తి కావడానికి ఒక నెల పడుతుంది'' అని మనోజ్ తివారీ తెలిపారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఆమోదించలేదంటూ ఆప్ చేసిన విమర్శలపై మాట్లాడుతూ, అసెంబ్లీ సజావుగా నడవకుండా చేయాలన్నదే ఆప్ కోరిక అని, అయితే కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సభ సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. విపక్షాలు సహకరించాలని సూచించారు. గత ప్రభుత్వం (ఆప్) అమలుకు నోచుకోని హామీలతో చేతులెత్తేసిందని, బీజేపీ హయాంలో మాత్రం ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు.


''మార్చి 8వ తేదీ నాటికి ఢిల్లీలోని ప్రతి మహిళ అకౌంట్‌లో రూ.2,500 వేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎల్పీజీ సిలెండర్ రూ.500కు ఇస్తామని చెప్పాం. హోలి, దీపావళి పండుగలకు ఉచిత సిలెండర్ అందజేస్తామన్నాం. ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా కసరత్తు చేస్తు్న్నారు'' అని మనోజ్ తివారీ తెలిపారు.


ఇవి కూడా చదవండి

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి

Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 08:58 PM