Bengaluru: 22న కర్ణాటక రాష్ట్ర బంద్..
ABN, Publish Date - Mar 01 , 2025 | 01:03 PM
మహారాష్ట్ర(Maharashtra)లో కేఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి, బస్సులకు రంగులు వేయడంతోపాటు బెళగావి(Belagavi)లో మరాఠీ మాట్లాడలేదని కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ మార్చి 22న రాష్ట్రబంద్‌కు కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ పిలుపునిచ్చారు.
- కేఎస్ ఆర్టీసీ సిబ్బందిపై మరాఠాల వేధింపులను సహించం
- కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్
బెంగళూర: మహారాష్ట్ర(Maharashtra)లో కేఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి, బస్సులకు రంగులు వేయడంతోపాటు బెళగావి(Belagavi)లో మరాఠీ మాట్లాడలేదని కండక్టర్‌పై దాడిని ఖండిస్తూ మార్చి 22న రాష్ట్రబంద్‌కు కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కన్నడ సంఘాల ముఖ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాటాళ్ నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలోనే కన్నడిగులను వేధించడం, మహారాష్ట్రకు వెళ్లే బస్సులు, సిబ్బందిపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్ అవినీతిపై పర్వేష్ వర్మ
మార్చి 7న బెళగావి ఛలో జరుపుతున్నామని, 11వ తేదీ మేకెదాటు ప్రాజెక్టు అమలు చేస్తూ అత్తిబెలె సరిహద్దును బంద్ చేస్తామన్నారు. 16న హొస్కోటె టోల్ బంద్ చేస్తామని, 22వ తేదీన కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చామన్నారు. బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించేందుకు తీర్మానించామన్నారు. టౌన్‌హాల్ నుంచి ఫ్రీడంపార్కు దాకా ర్యాలీ కొనసాగుతుందన్నారు.
అన్ని ప్రజాసంఘాలు, కార్మికసంఘాలను ఆహ్వానించామని, అందరూ మద్దతు తెలిపారన్నారు. ముఖ్యనాయకులు ప్రవీణ్‌శెట్టి, సా.రా.గోవిందు, కేసీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రక్షణా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ స్పందిస్తూ రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు లేదని ప్రకటించారు.
ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు
ఈవార్తను కూడా చదవండి: ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి
ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
Read Latest Telangana News and National News
Updated Date - Mar 01 , 2025 | 01:03 PM