ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Election Result: దిగ్గజాలు మటాష్.. గట్టెక్కిన అతిషి

ABN, Publish Date - Feb 08 , 2025 | 02:42 PM

ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. అయితే, కాస్తలో కాస్త ఆప్ పార్టీకి ఊరట కలిగిస్తూ కల్కాజీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి విజయకేతనం ఎగురవేశారు.

న్యూఢిల్లీ: వరుసగా నాలుగోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే 'ఆప్' ఆశలకు గండిపడింది. అగ్రనేతలకు ఢిల్లీ ఓటర్లు ఓటమిని చవిచూపించారు. ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. అయితే, కాస్తలో కాస్త ఆప్ పార్టీకి ఊరట కలిగిస్తూ కల్కాజీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi) విజయకేతనం ఎగురవేశారు. అతిషిపై పోటీ చేసిన బీజేపీ సీనియర్ నేత రమేష్ బిధూడి ఓటమి పాలయ్యారు.

Delhi Election Result: ఆ ఒక్క మాట ఆప్ కొంప ముంచిందా.


మధ్యాహం 2 గంటల వరకూ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, బీజేపీ 46 సీట్లలో ఆధిక్యం చాటుకుంటోంది. 20 సీట్లలో ఆప్ అధిక్యత కొన సాగుతోంది. బీజేపీ పాత రికార్డులన్నీ తిరిగరాసి మెజారిటీ మార్క్‌ను అవలీలగా దాటేస్తూ 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 1998 నుంచి బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. 2013 నుంచి బీజేపీ హవాకు ఆప్ గండి కొట్టింది. 2015, 2020 ఎన్నికల్లో ఆప్ అత్యధిక సీట్లలో గెలిచి, బీజేపీని మూడు నుంచి 8 సీట్లకు పరిమితం చేస్తూ వచ్చింది. ఆప్ అప్రతిహత విజయాలకు 2025 ఎన్నికల్లో బీజేపీ ఫుల్‌స్టాప్ పెట్టింది. 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది.


బిధూడీ వ్యాఖ్యలు కొంపముంచాయా?

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిధూడిని ఆ పార్టీ ప్రకటించుందంటూ ఒకదశలో 'ఆప్' ప్రచారం చేసింది. అయితే, బీజేపీ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. బిధూడీ పార్టీలో మంచి పలుకుబడి ఉన్న నేత అయినప్పటికీ అతిషి ఇంటిపేరు మార్చుకుందని, లేడిలా పరుగులు తీస్తోందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇంత నీచరాజకీయాలా అంటూ బిధూడీ వ్యాఖ్యలపై అతిషి కంటతడి పెట్టారు. అదీగాక, అతిషి ముఖ్యమంత్రిగా స్వల్పకాలమే సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటికీ ఎలాంటి దూకుడు చర్యల జోలికి వెళ్లకుండా పార్టీకి విధేయతను చాటుకోవడం కూడా ఆమె విజయానికి దోహదపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.


Also Read:

ఢిల్లీ సీఎం అతడే..అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..

ఢిల్లీ ఫలితాల్లో బిగ్ ట్విస్ట్

For More National News and Telugu News..

Updated Date - Feb 08 , 2025 | 02:42 PM