ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Border Crossing: ప్రేమ కోసమై ‘జైలు పాలాయనే’..

ABN, Publish Date - Jan 03 , 2025 | 06:26 AM

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన పాక్‌ యువతి కోసం దేశ సరిహద్దులు దాటి జైలు పాలయ్యాడో భారతీయ యువకుడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన బాదల్‌ బాబు అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్‌లోని లాహార్‌కు చెందిన సనా రాణి అనే యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది.

  • ప్రియురాలి కోసం అక్రమంగా పాక్‌ వెళ్లిన వ్యక్తి అరెస్టు

లహోర్‌, జనవరి 2: ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన పాక్‌ యువతి కోసం దేశ సరిహద్దులు దాటి జైలు పాలయ్యాడో భారతీయ యువకుడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన బాదల్‌ బాబు అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్‌లోని లాహార్‌కు చెందిన సనా రాణి అనే యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. చాలా రోజుల నుంచి మెసేజ్‌లు, ఫోన్ల ద్వారా ప్రేమాయణం నడిపిన వీరు కలవాలని నిర్ణయించుకున్నారు. తన వద్ద వీసా, పాస్‌పోర్టు లేకపోయినా ప్రేయసి కోసం గతంలో రెండు సార్లు పాక్‌ వెళ్లేందుకు బాబు విఫలయత్నం చేశాడు.


అయినా పట్టువదలని బాబు.. ఇటీవల అక్రమంగా దేశసరిహద్దు దాటి పాక్‌లోని బహౌద్దని జిల్లాకు చేరుకున్నాడు. ఈ క్రమంలో రాణి, బాబు ఓ ప్రదేశంలో కలుసుకొని మాట్లాడుకుంటుండగా పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించారు. బాబు వద్ద సరైన పత్రాలు లేవని తెలుసుకున్న అధికారులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో విచారణ జరిపిన సదరు కోర్టు బాబుకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే అమ్మాయిని పోలీసులు విచారించగా.. బాబును పెళ్లి చేసుకోడం ఇష్టంలేదని చెప్పడం కొసమెరుపు.

Updated Date - Jan 03 , 2025 | 06:26 AM