Budget 2025: మెడికల్ విద్యార్థులకు శుభవార్త.. పదేళ్లల్లో ఎన్ని మెడికల్ సీట్లు పెంచనున్నారంటే..
ABN, Publish Date - Feb 01 , 2025 | 12:35 PM
గత పదేళ్లలో కొత్తగా 1.01 లక్షల మెడికల్ సీట్లు పెంచినట్లు, అలాగే రానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల సీట్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల తెలిపారు.
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ 2025-26 (Budget 2025-26) సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన 8వ బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగించారు. 2024-25 ఆర్థిక ఏడాదికి సవరించిన వ్యయం రూ.47.16 లక్షల కోట్లని కేంద్రమంత్రి తెలిపారు. మూలధన వ్యయం (Capital Expenditure) రూ.10.1 లక్షల కోట్లుగా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదికి సవరించిన ఆదాయ అంచనా రూ.31.47 లక్షల కోట్లు (అప్పులు మినహా)గా కేంద్ర మంత్రి చెప్పారు. నికర పన్నుల ద్వారా సమకూరిన ఆదాయం రూ.25.57 లక్షల కోట్లని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ద్రవ్యలోటు జీడీపీలో 4.8 శాతంగా ఉందని అంచనా వేసినట్లు చెప్పారు. ఆర్థిక లోటు జీడీపీలో 4.4 శాతంగా అంచనా వేశారు. వచ్చే వారం పార్లమెంట్ ముందుకు వ్యక్తిగత ఆదాయపన్ను బిల్లు వస్తున్నట్లు పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
గత పదేళ్లలో కొత్తగా 1.01 లక్షల మెడికల్ సీట్లు పెంచినట్లు, అలాగే రానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల సీట్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల తెలిపారు. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పట్టణ పేదలు, వర్తకులకు చేయూత నిచ్చేందుకు సిద్ధమైనట్లు చెప్పారు.
వర్తకులకు రూ.30 వేల పరిమితితో UPI క్రెడిట్ కార్డులు, గిగ్ వర్కర్లకు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు దిద్దనున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు, అన్ని ప్రభుత్వ హైస్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్నారు. భారతీయ భాష పుస్తకాలకు డిజిటల్ రూపం ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. స్కూళ్లలో విద్యతోపాటు ఇకపై నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన 5 IITలకు మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Budget 2025: మీ ఆదాయం 10 లక్షలు దాటినా రూపాయి చెల్లించనక్కర్లేదు
Nirmala Sitharaman Saree: బడ్జెట్ 2025.. ఈసారి నిర్మలా సీతారామన్ ఏ చీర ధరించారంటే..
Updated Date - Feb 01 , 2025 | 12:40 PM