Budget 2025: మీ ఆదాయం 10 లక్షలు దాటినా రూపాయి చెల్లించనక్కర్లేదు
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:20 PM
Budget 2025: కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు సూపర్ న్యూస్ చెప్పింది. మీ ఆదాయం 10 లక్షలు దాటినా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పన్ను చెల్లింపుదారులకు బంపర్ న్యూస్ ఇచ్చింది. 12 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ట్యాక్స్ కట్టాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. కొత్త పన్ను శ్లాబులను సవరించింది కేంద్ర ప్రభుత్వం. 12 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఇచ్చింది. రూ.0-రూ.4 లక్షలు ఆదాయం ఉంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. రూ.4-రూ.8 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.8-రూ.12 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.12-రూ.16 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.16 నుంచి రూ.20 లక్షల ఆదాయం మీద 20 శాతం, రూ.24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారమన్ తెలిపారు.
ఇవీ చదవండి:
డెలివరీ సంస్థలో పనిచేస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ప్రపంచంలోనే తొలిసారి ఒకే స్తంభంపై ఐదు మెట్రోరైలు పట్టాలు
షెడ్యూల్డ్ కులాల మహిళలకు రూ.2కోట్ల వరకూ రుణాలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి