Eknath Shinde: నన్ను ఆషామాషీగా తీసుకోవద్దు.. డిప్యూటీ సీఎం హెచ్చరిక
ABN, Publish Date - Feb 21 , 2025 | 02:53 PM
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య అంతర్యుద్ధం నడుస్తోందనే ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. అంతా 'కూల్' అని షిండే చెబుతున్నప్పటికీ లుకలుకలు ఉన్నట్టు పలు సంఘటనలు చెబుతున్నాయి.
ముంబై: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మధ్య అంతర్యుద్ధం నడుస్తోందనే ప్రచారం మాత్రం ముమ్మరంగా జరుగుతోంది. అంతా 'కూల్' అని షిండే చెబుతున్నప్పటికీ లుకలుకలు ఉన్నట్టు పలు సంఘటనలు చెబుతున్నాయి. తాజాగా ఏక్‌నాథ్ షిండే ''నన్ను అంత తేలిగ్గా తీసుకోకండి'' అంటూ అన్యాపదేశంగా హెచ్చరించారు. అయితే ఆయన ఇచ్చిన 'హింట్' ఎవరిని ఉద్దేశించనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.
Rift in Mahayuti: మహారాష్ట్ర సీఎం కార్యక్రమాల్లో కానరాని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే
"నన్ను ఆషామాషీగా తీసుకోవద్దు. నన్ను తేలిగ్గా తీసుకునే వాళ్లకు ఈ విషయం ఇప్పటికే చెప్పాను. నేను సాధారణ పార్టీ కార్యకర్తను. అయితే బాబా సాహెబ్ కార్యకర్తను. ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. 2022లో ఇలా తేలిగ్గా తీసుకున్నప్పుడు నాణెం తిరగబడింది. నేను ప్రభుత్వాన్ని మార్చాను. సాధారణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని తెచ్చాం. విధానసభలో ఇచ్చిన తొలి ప్రసంగంలోనే దేవేంద్ర ఫడ్నవిస్ 200 సీట్ల కంటే ఎక్కువ తెచ్చుకుంటారని చెప్పారు. మాకు 232 సీట్లు వచ్చాయి. అందుకే చెబుతున్నాను. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. నేను ఇచ్చిన హింట్‌ను అర్ధం చేసుకునే వాళ్లు అర్ధం చేసుకుంటారు. నేను నా పని చేసుకుంటూ వెళ్తాను'' అని నాగపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ షిండే తెలిపారు.
ఫడ్నవిడ్ హాజరైన పలు అధికారిక కార్యక్రమాలకు షిండే ఇటీవల దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. థానే జల్లా బద్లాపూర్‌లో ఆగ్రా కోట వేధికగా ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొనగా, షిండే దూరంగా ఉన్నారు. 2027లో జరుగనున్న నాసిక్ త్రయంబకేశ్వర్ కుంభమేళా ఏర్పాట్ల విషయంలో సీఎం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి కూడా షిండే గైర్హాజరయ్యారు. షిండే వర్గం 22 మంది ఎమ్మెల్యేలకు ఇటీవల భద్రతా కేటగిరిని వై ప్లస్‌కు తగ్గించడం, క్యాబినెట్‌లో చోటు కల్పించకపోవడంతో షిండే గుర్రగా ఉన్నట్టు చెబుతున్నారు. దేవేంద్ర ఫడ్నవిస్ హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
DK Shiva Kumar: బెంగళూరు స్థితిని దేవుడు కూడా మార్చలేడు.. డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
Birthday: వారం ముందే సీఎం స్టాలిన్ జన్మదిన వేడుకలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 21 , 2025 | 02:55 PM