ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?

ABN, Publish Date - Feb 16 , 2025 | 04:24 PM

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రెండు రైళ్ల పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో ప్రయాణికులు తికమకపడి చివరకు తొక్కిసలాట సంభవించిందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు చివరి నిమిషంలో ప్లాట్‌ఫామ్ మార్పు కారణం కాదని వివరణ ఇచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై పోలీసులు తాజాగా వివరణ ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైళ్ల పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతో ప్రయాణికులు తికమకపడి తొక్కిసలాట జరిగిందన్నారు (Delhi Railway Station Stampede).

శనివారం జరిగిన ఈ ఘటనలో 18 మంది మరణించగా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. తమ రైలు మరో ప్లాట్‌ఫాంపైకి వస్తోందని చివరి నిమిషంలో అనౌన్స్‌మెంట్ విన్న ప్రయాణికులు ఒక్కసారిగా కదలడంతో తొక్కిసలాట జరిగిందన్న వార్తలు వినిపించాయి. అయితే, ఈ వాదనలను రైల్వే అధికారుల కొట్టిపారేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్టేషన్‌లో 14వ నెంబర్ ప్లాట్‌ఫాం ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు 16వ ప్లాట్‌ఫాంపైకి వస్తోందన్న ప్రకటన వెలువడింది. అప్పటికే ప్రయాగ్‌రాజ్ వెళ్లే నాలుగు రైళ్లు 12, 13, 14 ప్లాట్‌ఫాంలకు రావాల్సి ఉండగా వీటిల్లో మూడింటి రాకలో ఆలస్యం జరిగింది. దీంతో, ప్లాట్‌ఫాంపై ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు 14వ ప్లాట్‌ఫాంపై ఉన్న కొందరు ప్రయాణికులు రద్దీ కారణంగా రైలు ఎక్కలేకపోయారు.


Stampede Incident.. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన.. 18కి చేరిన మృతుల సంఖ్య

ఈ క్రమంలో అనౌన్స్‌మెంట్ వినగానే హడావుడిగా 16వ ప్లాట్‌ఫాంపైకి బయదేరారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి మెట్ల వద్ద కాలు జారి కిందపడటంతో మిగతా వారు అతడిని తప్పుకుని వెళ్లే క్రమంగా కిందపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ‘‘రైళ్లు క్యాన్సిల్ కాలేదు. ప్లాట్‌ఫాంలో కూడా మార్పులు లేవు’’ అని ఉత్తర రైల్వే సీపీఆర్‌ఓ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఘటనకు గల కారణాలు తేల్చేందుకు నార్తన్ రైల్వేకు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ , ప్రన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమీషనర్‌తో ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు.


Stampede Incident.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..

మృతి చెందిన వారిలో 77 ఏళ్ల వృద్ధురాలితో పాటు నలుగు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారు లోక్‌నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైల్వే శాఖ మృతులకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి మరో రూ.1 లక్ష పరిహారం ప్రకటనించింది. ఈ ప్రమాదానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

Read Latest Telangana News and National News

Updated Date - Feb 16 , 2025 | 04:41 PM