ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bharatpol: సీబీఐ 'భారత్‌పోల్' పోర్టల్‌తో ఇక నేరస్థుల ఆటకట్టు

ABN, Publish Date - Jan 06 , 2025 | 09:11 PM

భారతదేశంలోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఇంటర్‌పోల్‌ను అప్రమత్తం చేయవచ్చు.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ, స్వదేశీ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ట్రాక్ చేసి పట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరింత సులువు కానుంది. విదేశాల నుంచి భారతదేశంలో నేరాలు చేసి అక్కడికి పారిపోవడం, భారతదేశంలోని అజ్ఞాత ప్రాంతాల్లో తలదాచుకునే నేరస్థుల ఆటకట్టించేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీతో ఇండియన్ పోలీసులు తక్షణమే క్రిమినల్ రికార్డులు షేర్ చేసి ఆ వివరాలను అప్‌లోడ్ చేయడం ద్వారా ఇంటర్‌పోల్‌ను అప్రమత్తం చేయవచ్చు. ఇందుకోసం 'భారత్‌పోల్‍' (Bharatpol) అనే పోర్టల్‌‌ను సీబీఐ (CBI) రూపొందించింది. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారంనాడు ప్రారంభించనున్నారు.

HMPV Cases: ఆందోళన అవసరం లేదు, ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధం: జేపీ నడ్డా


నేరస్థులపై సకాలంలో ఉక్కుపాదం మోపడం, వారిని ట్రాక్ చేసి పట్టుకోవడం, నేరాలకు కళ్లెం వేయడం 'భారత్‌పోల్' లక్ష్యం. సాధారణ ప్రక్రియలో భారతదేశంలో, విదేశాలలో తలదాచుకున్న నేరస్థులను అరెస్టు చేయడానికి, సమాచారాన్ని పొందడానికి రాష్ట్ర పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సీబీఐని సంప్రదించాలి. దీని తర్వాత సీబీఐ ఇంటర్‌పోల్‌ను సంప్రదించి అవసరమైన నోటీసులు జారీ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటమే కాకుండా చాలా సమయం పడుతుంది. 'భారత్‌పోల్'తో ఈ సమస్య సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.


తాజా టెక్నాలజీతో రాష్ట్రాలు, దర్యాప్తు సంస్థలు నేరుగా భారత్‌పోల్‌తో కనెక్ట్ అవుతాయి. నేరస్థుడి సమాచారం లేదా స్థానాన్ని నిర్ధారించాల్సి వచ్చినప్పుడు పోలీసులు భారత్‌పోల్ ద్వారా నేరుగా ఇంటర్‌పోల్‌కు అభ్యర్థనను పంపుతారు. ఇంటర్‌పోల్ ఆ అభ్యర్థనను అంగీకరిస్తే, సంబంధిత నేరస్థుడికి వ్యతిరేకంగా రెడ్ నోటీసు, డిఫ్యూజన్ నోటీసు, ఇతర రకాల నోటీసులు జారీ అవుతాయి. ఇంటర్‌పోల్‌తో కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడం, వేగవంతం చేయడం భారత్‌పోల్ ఉద్దేశమని సీబీఐ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

Maha Kumbh Mela: కుంభమేళాకు 13 వేల రైళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 06 , 2025 | 09:11 PM