Tejasvi Surya: బీజేపీ ఎంపీ రిసెప్షన్ వేడుక.. అతిథులకు కీలక సూచన..
ABN, Publish Date - Mar 10 , 2025 | 03:41 PM
Tejasvi Surya: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు గాయనీ, భరత నాట్య కళాకారణి శివశ్రీ స్కంద ప్రసాద్‌తో ఇటీవల బెంగళూరులో వివాహమైంది. వీరి రిసెప్షన్ బెంగళూరులోని వృక్ష ప్యాలెస్‌లో జరిగింది. ఈ రిసెప్షన్‌కు విచ్చేసే అతిథులకు ఆయన కీలక సూచన చేశారు.
బెంగళూరు, మార్చి 10: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, గాయనీ, భరతనాట్యం కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌లకు బెంగళూరులో ఇటీవల వివాహమైంది. ఈ నేపథ్యంలో ఆయన తన వివాహన రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ రిసెప్షన్‌కు హాజరయ్యే అతిథులకు ఆయన కీలక సూచన చేశారు. రిసెప్షన్‌కు వచ్చే అతిథులు ఈ రెండింటిని తీసుకు రావద్దని సూచించారు. అందుకు సంబంధించిన వీడియోను ఎంపీ తేజస్వీ సూర్య తన ఎక్స్ ఖాతా వేదికగా ఆయనే స్వయంగా పోస్టు చేశారు. అతిథులు బహుమతులుగా పువ్వులు, బొకేలు లేకుంటే డ్రై ఫ్రూట్స్ తీసుకురావద్దని కోరారు. అలా ఎందుకు అన్నారో ఆయన సోదాహరణగా తన వీడియోలో వివరించారు.
ఈ రిసెప్షన్ అనంతరం 85 శాతం మేర పూలు, బొకేలు.. 24 గంటల లోపు పారవేస్తారన్నారు. అలాగే ఏటా దాదాపు 3 లక్షల కిలోల డ్రైఫ్రూట్స్ మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఏటా వీటి వల్ల రూ. 315 కోట్లు ఖర్చువుతోందన్నారు. ఈ నేపథ్యంలో తమ వివాహ రిసెప్షన్‌కు వీటిని తీసుకు రావొద్దని చెప్పారు. ఈ వేడుకకు హాజరై మీ ఆశీర్వాదం కోసం వేచి చూస్తున్నట్లు ఎంపీ తేజస్వి సూర్య స్పష్టం చేశారు.
Also Read: శివపార్వతుల ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయాలి
అలాగే ఈ వేడుకకు హాజరయ్యే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బెంగళూరులోని వృక్ష, ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఈ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 6వ తేదీన బెంగళూరు దక్షిణ నియోజకవర్గం ఎంపీ తేజస్వి సూర్య, శివశ్రీ స్కంద ప్రసాద్‌ల వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను తేజస్వి సూర్య.. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అవి వైరల్ అవుతున్నాయి.
ఈ వివాహ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్‌లోని పలువురు మంత్రులు వి. సోమన్న, అర్జున్ రాం మేఘవాల్‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రముఖ మృదంగ విద్వాంసుడు షీర్ ఖాజీ శ్రీ జే స్కంద ప్రసాద్ కుమార్తె శివ శ్రీ స్కంద ప్రసాద్‌నే తేజస్వి సూర్య వివాహం చేసుకున్నారు. ఇక ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వం చిత్రంలోని పాటను శివశ్రీస్కంద ప్రసాద్ ఆలపించిన సంగతి తెలిసిందే.
For National News And Telugu News
Updated Date - Mar 10 , 2025 | 04:25 PM