ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Railway Station: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట 15 మంది మృతి..

ABN, Publish Date - Feb 16 , 2025 | 05:00 AM

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15మంది చనిపోయారు. పది మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారని ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

  • మృతుల్లో ముగ్గురు చిన్నారులు.. పలువురి పరిస్థితి విషమం

  • మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు వేసిన రైల్వేశాఖ

  • ప్రయాణికులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15మంది చనిపోయారు. పది మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారని ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రైల్వేస్టేషన్‌కు తరలివచ్చారు. దీంతో 14, 16 ప్లాట్‌ ఫామ్‌ నెంబర్ల వద్ద తొక్కిసలాట జరిగింది.


గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు గాయపడినవారిని వివిధ ఆసుపత్రులకు తరలించాయి. తొక్కిసలాటలో మరణాలపై ఢిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ సక్సేనా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తునకు ఆదేశించింది.

Updated Date - Feb 16 , 2025 | 05:00 AM