ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మా దేశంలో చదువుకోండి.. పని చేసుకోండి!

ABN, Publish Date - Feb 14 , 2025 | 05:49 AM

యనైటెడ్‌ కింగ్‌డమ్‌లో నివాసం ఉంటూ చదువుకోవడంతోపాటు ఉద్యోగం కూడా చేయాలనుకొనేవారికి సువర్ణావకాశం. యూకే-ఇండియా యంగ్‌ ప్రొఫెషనల్స్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.

  • యువ భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: యనైటెడ్‌ కింగ్‌డమ్‌లో నివాసం ఉంటూ చదువుకోవడంతోపాటు ఉద్యోగం కూడా చేయాలనుకొనేవారికి సువర్ణావకాశం. యూకే-ఇండియా యంగ్‌ ప్రొఫెషనల్స్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. యువ భారతీయులతో పాటు యూకే పౌరులకు ఇరు దేశాల్లోనూ చదువుకోవడానికి. ఉద్యోగాలు చేయడానికి, ప్రయాణించడానికి ఈ పథకం అవకాశం కల్పిస్తోంది.


దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హులైన 3వేల మందిని ర్యాండమ్‌ విధానంలో ఎంపిక చేస్తారు. దీనికోసం 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన భారతీయ పౌరులు జీవోవీ.యూకే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం దరఖాస్తుదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వైపీఎస్‌ బ్యాలెట్‌ ఈ నెల 18న ప్రారంభమై 20న ముగియనుంది.

Updated Date - Feb 14 , 2025 | 05:49 AM