ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ఉద్యోగాల ఊచకోతకు ట్రంప్‌ మెమో

ABN, Publish Date - Feb 27 , 2025 | 05:39 AM

అవసరానికి మించిన ఉద్యోగులతో ప్రభుత్వం కిక్కిరిసిపోయిందని.. తాను అధ్యక్షుడైతే అలాంటివారందరినీ తొలగించి ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్‌ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 26: అవసరానికి మించిన ఉద్యోగులతో ప్రభుత్వం కిక్కిరిసిపోయిందని.. తాను అధ్యక్షుడైతే అలాంటివారందరినీ తొలగించి ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్‌ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పది రోజుల క్రితమే వివిధ ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 9,500 మందిని (వారిలో అత్యధికులు ప్రొబేషన్‌లో ఉన్న తాత్కాలిక ఉద్యోగులే) తొలగించిన ఆయన.. తాజాగా సివిల్‌ సర్వీస్‌ రక్షణ ఉన్న ఫెడరల్‌ ఉద్యోగులపై గురిపెట్టారు. ఉద్యోగులను తగ్గించాలని.. ఉద్యోగులను తొలగించడమే కాక, ఆయా పొజిషన్లను కూడా తొలగించాలని పేర్కొంటూ వైట్‌హౌస్‌ ‘ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌’ డైరెక్టర్‌ రస్సెల్‌ వాట్‌ ఒక మెమో జారీ చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగులను తగ్గించాలని ప్రెసిడెంట్‌ ట్రంప్‌ కోరుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు.


‘‘ఫెడరల్‌ ప్రభుత్వం ఖరీదుగా.. అదే సమయంలో అసమర్థంగా మారింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. అమెరికన్‌ ప్రజలకు కావాల్సిన ఫలితాలను అందించట్లేదు’’ అని ఆయన ఆ మెమోలో వివరించారు. కాబట్టి, అన్ని ఫెడరల్‌ విభాగాల అధిపతులూ.. పెద్ద ఎత్తున సిబ్బంది తగ్గింపునకు (రిడక్షన్‌ ఇన్‌ ఫోర్స్‌- రిఫ్‌) తక్షణ సన్నాహకచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలి దశ ప్రణాళికల వివరాలను మార్చి 13కల్లా.. రెండో దశ ప్రణాళికలను ఏప్రిల్‌ 15కల్లా తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని కార్యాలయాలు సిబ్బంది తొలగింపు ప్రక్రియను చేపట్టినట్టు సమాచారం. ఫెడరల్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసే ‘జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌’ విభాగం ఇప్పటికే తమ సిబ్బందికి.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైందని పేర్కొంది.

Updated Date - Feb 27 , 2025 | 05:39 AM