ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా..: ట్రంప్‌

ABN, Publish Date - Jan 08 , 2025 | 05:55 AM

పొరుగున ఉన్న కెనడా దేశాన్ని కలుపుకొని అమెరికాకు 51వ రాష్ట్రంగా మార్చుతామని అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం పునరుద్ఘాటించారు.

వాషింగ్టన్‌, జనవరి 7: పొరుగున ఉన్న కెనడా దేశాన్ని కలుపుకొని అమెరికాకు 51వ రాష్ట్రంగా మార్చుతామని అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం పునరుద్ఘాటించారు. ప్రజాదరణ కోల్పోయిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పదవికి రాజీనామా చేసిన అనంతరం ట్రంప్‌ సోమవారం సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. ట్రంప్‌, ట్రూడోల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేకపోవడం గమనార్హం. ‘‘అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండేందుకే కెనడాలోని చాలా మంది ముచ్చటపడుతున్నారు. అమెరికా ఇంకెంతకాలం కెనడాకు భారీగా రాయితీలు ఇవ్వలేదు. ఇది తెలిసే ట్రూడో రాజీనామా చేశారు. అమెరికాలో కెనడా విలీనమయితే ఎలాంటి పన్నులు ఉండవు. కెనడాకు రష్యా, చైనా నౌకల నుంచి ముప్పు ఉండదు. కలిసిపోయి పెద్ద దేశంగా మారొచ్చు!’’ అని అభిప్రాయపడ్డారు.

Updated Date - Jan 08 , 2025 | 05:55 AM