వైట్‌హౌస్‌లోకి తనయుడితో మస్క్
ABN, Publish Date - Feb 13 , 2025 | 05:28 AM
ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే దిశగా రష్యాను ఒప్పించేలా అమెరికా చర్యలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు.
ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి అధ్యక్ష భవనంలోకి..
తండ్రి భుజాలనెక్కి కూర్చున్న నాలుగేళ్ల కొడుకు
మస్క్ నేతృత్వం వహిస్తున్న విభాగానికి మరిన్ని
అధికారాలు కట్టబెడుతూ ట్రంప్ ఆదేశాల జారీ
పుతిన్‌కు ట్రంప్ ఫోన్
ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై తక్షణం అమెరికాతో చర్చలకు పుతిన్ అంగీకారం
వాషింగ్టన్, ఫిబ్రవరి 12: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే దిశగా రష్యాను ఒప్పించేలా అమెరికా చర్యలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. ఇద్దరు నేతలు గంటన్నరపాటు మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ అంశమ్మీద అమెరికాతో తక్షణం చర్చించేందుకు పుతిన్ అంగీకరించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయమ్మీద తాను పుతిన్‌తో చర్చించినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ట్రంప్ వెల్లడించారు.
ఈ మేరకు తమ ప్రత్యేక బృందం రష్యాతో వెంటనే సంప్రదింపులు చేయనుందని, త్వరలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌స్కీతోనూ మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. యుద్ధం వల్ల సంభవిస్తున్న మరణాలను ఆపాలనేదానిపై పుతిన్, తాను అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Updated Date - Feb 13 , 2025 | 05:28 AM